వణికిన హిందూ మహా సముద్ర గర్భం

హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. శ్రీలంకకు నైరుతి దిశగా, ఇండోనేషియా, మలేసియాలకు వాయవ్య దిశగా సముద్ర గర్భంలో భూమి ప్రకోపించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత దేశాలు ఉలిక్కిపడ్డాయి. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బీచ్ ల వద్ద సైరన్ ను మోగించారు. తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ఇండోనేషియాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బందా అచె సహా కొన్ని బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు.

తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9 గా రికార్డయింది. ఇండోనేషియా సమీపంలోని ప్రఖ్యాత తీర ప్రాంత నగరం బందా అచెకు సమీపంలో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ ఉదయం 8:10 నిమిషాలకు 1.806 అక్షాంశం, 94.924 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు వివరించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో టోక్టానిక్ ప్లేట్లల్లో చోటుచేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు పేర్కొంది.

Earthquake Today Magnitude 4 9 Hits Indian Ocean Shallow 10 km Depth No Damage Reported for impact

ఈ నెల 5వ తేదీన అదే ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూమి ప్రకంపించింది. ఆరు రోజుల వ్యవధిలో ఇప్పుడు మళ్లీ అక్కడే భూమి ప్రకంపించడం అసాధారణం. పైగా ఇది షాలో ఎర్త్ క్వెక్. అంటే లోతు తక్కువగా ఉండే భూకంపం. లోతైన భూకంపాలతో పోలిస్తే ఇవి ఎంతో ప్రమాదకరమైనవి. లోతు తక్కువగా ఉండటం వల్ల షాలో భూకంప తరంగాలు ఉపరితలానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవు. భూమి కంపించిన వెంటనే వాటి తీవ్రత ఉపరితలాన్ని తాకుతుంది. తక్కువ దూరం ప్రయాణించడం వల్ల భూమి మరింత బలంగా కంపిస్తుంది. ఇది భవనాలకు గణనీయమైన నష్టాన్ని, అధిక ప్రాణనష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.

2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో గల అచే పశ్చిమ తీరం వద్ద 9.2-9.3 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. బర్మా ప్లేట్, ఇండియన్ ప్లేట్ మధ్య ఉన్న ఫాల్ట్‌లో చీలిక కారణంగా ఈ సముద్రగర్భ మెగాథ్రస్ట్ భూకంపం చోటుచేసుకుంది. ఇది భారీ సునామీకి కారణమైంది. ఇందులో అలలు దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న అనేక తీరప్రాంతాలను ధ్వంసం చేసింది.

ఇండోనేషియా, శ్రీలంక, భారత్, ఖావో లాక్ సహా 14 దేశాల్లో 2,27,898 మంది మరణించారు అప్పట్లో. ఈ విపత్తు తీరప్రాంతాల్లో జీవన పరిస్థితులకు ఛిన్నాభిన్నం చేసింది. చరిత్రలో అత్యంత ఘోరమైన సునామీగా, 21వ శతాబ్దంలో అత్యంత ప్రాణాంతక సహజ విపత్తుగా అతి పెద్ద ప్రకృతి విపత్తులలో ఒకటిగా ఈ ఘటన చరిత్రలో నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+