పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం

పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంత దేశాలను వణికించింది. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణనష్టంగానీ నమోదు కాలేదు. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్లు సమాచారం అందింది. పలుచోట్ల బీచ్ ల నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. వాటిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైంది. ఉపరితలం నుంచి 238 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్లల్లో సంభవించిన భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 11:35 నిమిషాల సమయంలో సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఈ మేరకు ఎక్స్ లో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది.

Earthquake Today Magnitude 7 6 Shakes Tonga South Pacific Ocean no immediate damage or tsunami

దీని తీవ్రత ఫిజి, టోంగా, సమోవా, న్యూకాలెడోనియా, కుక్ ఐలండ్స్, ఫ్రెంచ్ పాలినేసియా, నార్ ఫోక్ ఐలండ్స్, సొలొమన్ ఐలండ్స్ పై పడింది. ఆయా చిరు ద్వీపాలు వణికిపోయాయి. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భూకంపం నేపథ్యంలో టోంగా తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. తాత్కాలికంగా బీచ్ లను మూసివేశారు. అటు ఆస్ట్రేలియాపైనా దీని ప్రభావం స్వల్పంగా కనిపించింది. భూకంపం సంభవించిన లోతు అధికంగా ఉండటం వల్ల సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.

ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే భారీ భూకంపాలకు నిలయమైన రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం. భూమిపై సంభవించే అతిపెద్ద భూకంపాలలో దాదాపు 81 శాతం ఈ ప్రాంతంలోనే చోటు చేసుకుంటుంటాయి. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల వెంబడి ఉంది. ఇక్కడ సముద్రపు క్రస్ట్‌తో కూడిన ప్లేట్లు మరొక ప్లేట్ కిందకి సబ్‌డక్షన్ అవుతుంటాయి. ఈ సబ్‌డక్షన్ జోన్‌లలో ప్లేట్ల మధ్య రాపిడి, వాటి లోపల చీలికల కారణంగా భూకంపాలు సంభవిస్తాయి.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పొడవు.. సుమారు 40,000 కిలోమీటర్లు. వెడల్పు 500 కిలోమీటర్లు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ భాగాన్ని ఆవరించి ఉంటుంది. దాని భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది. సబ్‌డక్షన్ జోన్‌ల ద్వారా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడింది. సుమారు 115 మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. ప్లేట్ల నిర్మాణం క్రమంగా మారుతున్న కొద్దీ, ఇండోనేషియా, న్యూ గినియాలోని ప్రస్తుత సబ్‌డక్షన్ జోన్‌లు సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి.

టోంగా.. పసిఫిక్ మహాసముద్రంలో 171 ద్వీపాలను కలిగి ఉన్న ద్వీపసమూహం. ఇక్కడ లక్ష మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది టోంగాటాపు ప్రధాన ద్వీపంలో ఉంటారు. ఈ దేశం న్యూజిలాండ్‌కు ఈశాన్యంగా సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉంది. టోంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోకి వస్తుందీ ద్వీప సముదాయం, ఈ ప్రాంతం తరచుగా సంభవించే భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు ప్రసిద్ధి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+