నేపాల్‌లో 12 చోట్ల భూకంపం: భీభత్సం సృష్టించింది ఇలా?
న్యూఢిల్లీ: నేపాల్ రాజధాని ఖాఠ్మండుకు సుమారు 77 కిలోమీటర్లు దూరంలో శనివారం ఉదయం 11.41 గంటలకు 7.5 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. ఆ తర్వాత రెండున్నర గంటల వ్యవధిలో నేపాల్ మొత్తంగా 12 చోట్ల భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఈ భూపంకంతో నేపాల్‌లోని భవనాలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటితో పాటు నేపాల్ చారిత్రక కట్టడాలు కూడా కుప్పకూలాయి. ఖాట్మండులోని 62 మీటర్ల ఎత్తైన చారిత్రక ధరారా టవర్ భూకంప తీవ్రతకు కుప్పకూలింది. నేపాల్‌లో రెండున్నర గంటల వ్యవధిలో సంభవించిన భూకంపనలు తీవ్రత వివరాలిలా ఉన్నాయి.

తొలి భూకంప తీవ్రత:
* లామ్‌జంగ్‌కు 41 కిలోమీటర్ల దూరంలో 5.0 తీవ్రత
* కొడారికి 22 కిలోమీటర్ల దూరంలో 4.7 తీవ్రత
* బనేపాకు 17 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రత
* నగర్‌కోట్‌కి 20 కిలోమీటర్ల దూరంలో 4.6 తీవ్రత
* నగర్‌కోట్‌కి 15 కిలోమీటర్ల దూరంలో 5.0 తీవ్రత
* బనేపాకు 22 కిలోమీటర్ల దూరంలో 4.5 తీవ్రత
* ఖాఠ్మండుకి 33 కిలోమీటర్ల దూరంలో 4.8 తీవ్రత
* పనోటికి 5 కిలోమీటర్ల దూరంలో 4.8 తీవ్రత
* కొడారికి 25 కిలోమీటర్ల దూరంలో 5.0 తీవ్రత
* నగర్‌కోట్‌కి 25 కిలోమీటర్ల దూరంలో 5.5 తీవ్రత
* లామ్‌జంగ్‌కి 49 కిలోమీటర్ల దూరంలో 6.6 తీవ్రత
* కొడారికి 28 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రత
BREAKING: Significant damage in Kathmandu after major earthquake strikes Nepal: http://t.co/c4JUZsCOxA pic.twitter.com/euvmzSD7xx
— Corinne Cathcart (@cdcathcart) April 25, 2015 











Click it and Unblock the Notifications