Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోరాడండి లేదా చనిపోండి.. మస్క్ సంచలన పోస్ట్..!

బ్రిటన్‌లో వలసల వ్యతిరేక ఆందోళనలు భారీ స్థాయిలో మిన్నంటాయి. సెంట్రల్ లండన్ వీధుల్లో లక్షలాది మంది పాల్గొన్న ఈ నిరసనలు యూకే చరిత్రలోనే అతి పెద్దవిగా నిలిచాయి. ''ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్రీడమ్'' పేరిట కార్యకర్త టామీ రాబిన్సన్ పిలుపుతో ఈ ర్యాలీ జరిగింది.

లక్షల మంది వీధుల్లోకి

మొదట 10,000 మందితో మొదలైన ఈ ర్యాలీ.. క్రమంగా పెరిగి దాదాపు 1.5 లక్షల మంది పాల్గొనే స్థాయికి చేరింది. ''యునైట్ ది కింగ్‌డమ్'' పేరుతో సాగిన ఈ ప్రదర్శనలో వలసల వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. ''మా దేశం మాకే కావాలి'' అంటూ నిరసనకారులు స్లోగన్స్ ఇచ్చారు. అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. వయసు పైబడినవారు కూడా వీల్‌చైర్లలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

elon-musk-shocking-post-on-anti-immigration-rally-at-britain

ఇదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజమ్' పేరిట మరో ర్యాలీ జరిగింది. సుమారు 5 వేల మంది పాల్గొన్న ఈ నిరసనలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. రెండు గ్రూపులు ఒకేసారి వీధుల్లోకి రావడంతో ఘర్షణలు జరుగుతాయన్న భయంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఆందోళనలు అంచనాలను మించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. నిరసనకారులు వాటర్ బాటిల్స్, పలు వస్తువులతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో 26 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో అదనపు బలగాలను రంగంలోకి దింపి, లైఫ్ గార్డ్స్, హెల్మెట్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించి పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

ఎలాన్ మస్క్ మద్దతు..

ఈ ర్యాలీపై ప్రపంచ వ్యాప్తంగా దృష్టి పడింది. ముఖ్యంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వలస వ్యతిరేక నిరసనలకు బహిరంగ మద్దతు పలికారు. వర్చువల్‌గా ప్రసంగిస్తూ, యూకేలో పాలన మార్పు అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉంది. ఇక నిరసనకారుల వద్ద రెండే మార్గాలు - తిరిగి పోరాడటం లేదా చనిపోవడం" అని మస్క్ హెచ్చరించారు. లేబర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన, పార్లమెంట్ రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు జరపాలని కోరారు.

అమెరికాలో ఇటీవల హత్యకు గురైన ట్రంప్ అనుచరుడు, రైటిస్ట్ నేత చార్లీ కిర్క్ ఘటనను ప్రస్తావిస్తూ, లెఫ్టిస్టులు రాజకీయ హింసకు పాల్పడుతున్నారని మస్క్ ఆరోపించారు. "నా స్నేహితుడిని హత్య చేశారు. లెఫ్ట్ ప్రజలు దీన్ని వేడుకగా జరుపుకున్నారు" అంటూ విమర్శలు చేశారు. యాంటీ-టెర్రర్ అలయన్స్ గ్రూప్ కూడా ఈ ర్యాలీలకు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+