Elon Musk: మహిళా ఉద్యోగస్తులపై కన్ను..ఒక్క రాత్రి గడిపితే భారీ ఆఫర్..!
Elon Musk:రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది అన్నట్లుగా ఉంది స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యవహారం.ప్రముఖ రాకెట్ తయారీ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్‌పై ఆ కంపెనీలో పనిచేసే 8 మంది ఇంజినీర్లు లైంగిక ఆరోపణలు చేశారు. బయట ప్రపంచానికి ఈ విషయం తెలియడంతో మస్క్ ఆ ఉద్యోగులపై వేటు వేశారు. ఉద్యోగం నుంచి తొలగించారు. మస్క్ అంతలా రెచ్చిపోవడానికి ముందు ఏం జరిగింది..?
మహిళలపై మస్క్ కన్ను
ఎలన్ మస్క్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మరి పేరుకు తగ్గట్టుగా ఈ పెద్దమనిషి వ్యవహరించలేదు. తాను నడిపే అతిపెద్ద సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగస్తులపై కన్నేశారు. కామంతో రగిలిపోయాడు. ఇక ఆపుకోలేక నేరుగా ఆ ఉద్యోగస్తులను తన పడకగదికి రమ్మన్నారు. తనతో ఒకరాత్రి గడపాల్సిందిగా కోరాడు. ప్రపంచ కుబేరుడనే అహంతో తాను ఏది చెబితే దానికి తలూపుతారని ఈ పెద్దమనిషి భావించాడు. కానీ బొమ్మ అడ్డంగా తిరిగింది. ఆ మహిళలు మస్క్‌కు బుద్ధి చెప్పేలా వ్యవహరించారు.

సెక్స్ చేస్తే కానుకగా గుర్రం
ఎలన్ మస్క్ సంస్థలైన స్పేస్ ఎక్స్ , టెస్లా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు వారి బాస్ చేష్టలతో చాలా ఇబ్బంది పడేవారని చెప్పుకొచ్చారు.అంతేకాదు మహిళలను చిన్న చూపు చూసేవారని ఒకే పోస్టులో ఉన్నప్పటికీ పురుషులకంటే తక్కువ వేతనం మహిళలకు చెల్లించేవారని తెలుస్తోంది.ఆఫీసుల్లో ఎక్కువగా శృంగారంపై మస్క్ చర్చించేవాడని అయితే అవి బయటకు వచ్చేవికావని బాధిత మహిళలు చెప్పారు.2016లో స్పేస్ ఎక్స్ విమానంలో అటెండెంట్‌గా పనిచేసే మహిళను లైంగికంగా ప్రలోభాలకు గురిచేసినట్లు వెల్లడించింది.తనతో సెక్స్ చేస్తే ఒక గుర్రాన్ని కానుకగా ఇస్తానని మస్క్ ఆఫర్ చేసినట్లు బాధితులరాలు పేర్కొంది.
తనతో పిల్లలు కనాలంటూ...
సంస్థలో పనిచేస్తూ 2013లో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మరో మహిళ తన చేదు అనుభవాన్ని పంచుకుంది. ప్రపంచ జనాభా పెరగడం లేదని తనతో పడుకుని పిల్లలను కనాలంటూ మస్క్ వేధించేవాడని చెప్పుకొచ్చింది.అప్పటికే మస్క్ 10 మంది పిల్లలకు తండ్రి. రాత్రి వేళల్లో తాను ఒంటరిగా నిద్రించలేకున్నానని తోడుగా వచ్చి తన పక్కన పడుకోవాల్సిందిగా మెసేజ్‌లు పెట్టేవాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
మస్క్ ఎలాంటి తప్పు చేయలేదట
ఇక ఈ విషయాలు బయటకు పొక్కడంతో ఆ సంస్థలో పనిచేస్తూ తన పై ఆరోపణలు గుప్పించిన 8 మంది ఉద్యోగస్తులు అందులో నలుగురు మహిళలు, నలుగురు పురుషులపై మస్క్ వేటు వేశారు. మస్క్ ప్రవర్తన పై ఓ లేఖను ఆఫీసులో సర్క్యులేట్ చేశారన్న విషయం ఈ బిలియనీర్ దృష్టికి రావడంతో వారిని తక్షణమే తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇదంతా జరిగింది 2022లో కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు లాస్‌ఏంజిలస్ కోర్టులో పిటిషన్ వేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.అయితే ఉద్యోగస్తులు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పేస్ ఎక్స్ సంస్థ తరపున లాయర్లు తెలిపారు. వారు కంపెనీ పాలసీలను అతిక్రమించినందుకే వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
మొత్తానికి లైంగిక ఆరోపణలతో మరోసారి మస్క్ వార్తల్లో నిలిచారు. అంతకుముందు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలను ఎదుర్కొని మస్క్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు.












Click it and Unblock the Notifications