భారతీయుల కోసం ఎతిహాద్ ఎయిర్ వేస్ స్పెషల్ ఆఫర్.. ఎంత డిస్కౌంట్ అంటే ?
సమ్మర్ లో కూల్ గా చిల్ అవ్వడం కోసం ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకోసమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ వేసవిలో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే భారతీయ ప్రయాణికులకు 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈ సీజన్ లో భారతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, వార్సా, ప్రాగ్ రూట్లలో ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్ వర్తిస్తుందని ఎతిహాద్ యాజమాన్యం ప్రకటించింది. మార్చి 28వ తేదీ వరకు ఈ స్పెషల్ ఆఫర్ తో టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించేందుకు టికెట్ లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇక సమ్మర్ వెకేషన్‌ను తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎతిహాద్ ఎయిర్‌వేస్ కోరుతుంది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమడెస్టినేషన్ ఫిక్స్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలని పిలుపునిస్తుంది. మరి ఇండియన్ ట్రావెలర్స్ ఎంత మేరకు ఈ ఆఫర్ ను వినియోగించుకుంటారో తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఆఫర్ ముగియడానికి రెండు రోజులే ఉండడంతో త్వరగా ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు.












Click it and Unblock the Notifications