కేపిటల్ హిల్ వద్ద ఆగి ఉన్న ట్రక్క్.. భారీగా బాంబులు, తుపాకులు...

కేపిటల్ హిల్‌లో జరిగిన ఘటనతో అమెరికా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ మద్దతుదారులు కావాలని దాడి చేసినట్టు క్రమంగా తెలుస్తోంది. అలాబామకు చెందిన ఓ వ్యక్తి కేపిటల్ హిల్ వద్ద ట్రక్క్ పార్క్ చేసినట్టు గుర్తించారు. అయితే అందులో 11 నాటుబాంబులు ఉన్నాయి. రైఫిల్, గన్, రెండు బ్లాకులను గుర్తించారు.

మరో వ్యక్తి చేతిలో రైఫిల్, భారీగా మందుగుండు ఉంది. అతను హౌస్ కీపర్ నాన్సీ పెలోసిపై కాల్పులు జరుపుతూ.. పరుగెత్తాలని కోరినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించనని ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత.. అతని మద్దతుదారులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మద్దతుదారులే తుపాకులు, మందుగుండు కేపిటల్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్లారు.

Feds say police found a pickup truck full of bombs and guns near Capitol insurrection as wide-ranging investigation unfurls

కేపిటల్ గ్రౌండ్ అల్లర్లకు పాల్పడిన 13 మందిపై అభియోగాలు మోపామని పోలీసులు తెలిపారు. వెస్ట్ వర్జినియా నేత, స్పీకర్ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి ప్రవేశించిన వారిపై కూడా కేసు పెట్టారు.

వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనం(కేపిటల్ బిల్డింగ్)లో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టగా ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తుపాకులు, బాంబుల మోతతో పార్లమెంట్ బిల్డింగ్ దద్దరిల్లింది. ఈ ఘటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+