ఫిఫా కప్: ఫైనల్ చూడ్డానికి రావాలని మోడీకి బ్రెజిల్
న్యూఢిల్లీ: ఫిఫా ప్రపంచ కప్ 2014 ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి రావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బ్రెజిల్ దేశ అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ ఆహ్వానించారు. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఫిఫా ప్రపంచ కప్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫిఫా ప్రపంచకప్‌కు విశేష ఆదరణ ఉంది. మన దేశంలోను పశ్చిమ బెంగాల్ తదితర ఉత్తరాది ప్రాంతాల్లో ఆదరణ ఉంది. ఈ ఫిఫా ఫుట్‌బాల్ పోటీలు చూసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా... బ్రెజిల్ అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ భారత ప్రధాని మోడీకి ఫైనల్ మ్యాచ్‌కు రావాలని స్వయంగా ఆహ్వానించారు. జూలై 13వ తేదీన రియో డి జెనరియోలోని ఎస్టాడియా మరకానాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని ఆయన మోడీని ఆహ్వానించారు.
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షులు జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు జాకోబ్ జుమా తదితరులు వస్తున్నారు. హాజరు కావాలా లేదా అని మోడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై 15 నుండి 17 వరకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ కప్ జూలై 13న జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో మోడీ రెండు రోజుల ముందు వెళ్లి ఫైనల్ చూస్తారా అనేది చూడాలి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications