వైరల్ వీడియో: అమెరికా అధ్యక్షుడైనా.. భార్య బాధితుడే..?
ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ తన భార్యతో గొడవపడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ హెలికాప్టర్ లో గొడవపడుతున్నట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు ట్రంప్ కూడా భార్యా బాధితుడేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల న్యూయార్క్ లో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన సతీమణి మెలానియా ట్రంప్ తో కలిసి హాజరైన విషయం తెలిసిందే. అయితే సమావేశం అనంతరం వాళ్లు మెరైన్ వన్ హెలికాప్టర్ లో తిరిగి వైట్ హౌస్ కు బయల్దేరారు.
📹Journalists captured on video what appears to be an argument between Trump and his wife Melania
— NEXTA (@nexta_tv) September 26, 2025
The footage shows the U.S. President wagging his finger at the First Lady, while she shakes her head in response.
It’s unclear what they were discussing on board the plane, but… pic.twitter.com/3xGwDXgrFu
ఆ సమయంలో ట్రంప్.. మెలానియా ట్రంప్ ఎదురెదురుగా కూర్చొన్నారు. ఇరువురూ ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుతున్నారు. ఏదో విషయంపై వాళ్లిద్దరూ గొడవ పడుతున్నట్లుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అలాగే ఇటీవల ఐరాస ప్రధాన కార్యాలయంలో ట్రంప్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసంగం కోసం ట్రంప్ దంపతులు పైకి వెళ్తున్న క్రమంలో ఎస్కలేటర్ పై అడుగుపెట్టిన వెంటనే అది ఆగిపోయింది. సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ మెట్లు ఎక్కి వెళ్లారు.












Click it and Unblock the Notifications