అత్యంత ప్రమాదకరం: భారత్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్: కాలిఫోర్నియాలో తొలి కేసు

వాషింగ్టన్: ఇప్పటిదాకా బ్రిటన్, ఆఫ్రికన్ వేరియంట్‌లకు సంబంధించిన కొత్త కరోనా వైరస్ కేసులను చూశాం. ఇక తాజాగా కొత్త కరోనా వైరస్ కూడా పుట్టుకొచ్చిందట. ఈ రకం వేరియంట్ కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ఈ రకానికి చెందిన కొత్త కరోనా కేసు తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియాలో వెలుగులోకి వచ్చింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో తొలిసారిగా కనుగొన్న కొత్తరకం వేరియంట్‌తో కూడిన వైరస్ తొలి కేసు కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంలో గుర్తించినట్లు తెలిపారు.

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ పేషెంట్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ గుర్తించామని, శాంపిళ్లను క్లినికల్ వైరాలజీ ల్యాబొరేటరీకి పంపించామని స్టాన్‌ఫర్డ్ హెల్త్‌కేర్ అధికార ప్రతినిధి లిసా కిమ్ తెలిపారు. ఈ రకానికి చెందిన వైరస్ అమెరికాలో గుర్తించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు దీనికి ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించినట్లు లిసా తెలిపారు. ఈ వైరస్ డబుల్ మ్యూటెంట్‌తో ఇది కూడుకుని ఉన్నదని, స్పైకీ ప్రొటీన్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పేషెంట్‌ను ప్రత్యేకంగా ఐసొలేషన్‌లో ఉంచామని లిసా కిమ్ అన్నారు.

 First confirmed case of Indian variant Covid19 found in California

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికా.. అగ్రగామిగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా అమెరికాలో 3,14,20,331 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,68,777 మంది మరణించారు. అత్యధిక కేసులు నమోదైనవి కాలిఫోర్నియాలోనే 36,80,061 పాజిటివ్ కేసులు ఈ స్టేట్‌లో రికార్డ్ అయ్యాయి. 59,736 మంది మృత్యువాత పడ్డారు. రెండో స్థానంలో టెక్సాస్ కొనసాగుతోంది. అక్కడ 28,05,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 48,914 మంది చనిపోయారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలి రోజుల్లో పాజిటివ్ కేసులు, మరణాల్లో సుదీర్ఘకాలం పాటు టాప్‌లో కొనసాగిన న్యూయార్క్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 50,905 మంది మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+