వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ చరిత్రలో లేదు: ఎన్నికల్లో గెలిచిన మహిళలు

|
Google Oneindia TeluguNews

రియాద్: సౌదీ అరేబియా చరిత్రలో ఇప్పటి వరకూ మహిళలకు ప్రాతినిధ్యమే లేదు. అయితే 2015 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మహిళలు ఎన్నికల్లో విజయం సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు.

సౌదీ అరేబియా చరిత్రలో ఇప్పటి వరకూ మహిళలు ఓట్లు వెయ్యలేదు. ఎన్నికల్లో పోటి చెయ్యలేదు. అయితే మొదటి సారి ఓట్లు వేసిన మహిళలు 20 ప్రాంతాల్లో పోటి చేసి ప్రజా ప్రతినిధులయ్యారు.

దేశంలో మొత్తం 2,100 మునిసిపల్ కౌన్సిల్ సీట్లు ఉన్నాయి. అందులో కేవలం 20 సీట్లు మాత్రం మహిళలకు కేటాయించారు. ఒక్క శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడంతో అక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First election open to women in Saudi Arabia

అసలే ఓట్లు వెయ్యడానికి అవకాశం లేకుండా, ఎన్నికల్లో పోటి చెయ్యడానికి ఇప్పటి వరకూ ఆస్కారం లేకపోవడంతో ఇప్పటికైన చక్కటి అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని సౌదీ అరేబియా మహిళలు అంటున్నారు.

సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కులేదు. వివాహం, ఉన్నత చదువులు, ప్రయాణాలు తదితర విషయాలలో పురుషుల మాట వినాలి. సౌదీ రాజు తలుచుకుంటే మరింత మంది మహిళా ప్రతినిధులు ఎన్నిక అయ్యే అవకాశం ఉంది..

ఇప్పు డు జరిగిన ఎన్నికల్లో 2,100 స్థానాలకు 7 వేల మంది పోటిపడ్డారు. అందులో 979 మంది మహిళలు ఉన్నారు. 979 మంది మహిళల్లో 20 మంది విజయం సాధించారు. రానున్న రోజుల్లో మాకు మరింత చక్కటి అవకాశం వస్తుందని సౌదీ మహిళలు అంటున్నారు.

English summary
The 20 female candidates represent just one per cent of the roughly 2,100 municipal council seats up for grabs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X