ఒమిక్రాన్‌తో తొలి మరణం.. యూరప్‌లో కరోనా విలయతాండం.. భయాందోళనలో ప్రపంచం
ప్రపంచం వ్యాప్తంగా ఒక వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజుకు రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆస్పత్రులన్నీఈ వైరస్ బాధితులతో నిండిపోయాయి. మరణాల సంఖ్య అంతకంతకూ మళ్లీ పెరుగుతూనే ఉంది. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదైంది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం..
ప్రపంచ దేశాలు కరోనా మరణాలతో అల్లాడుతుంటే.. తాజా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది . ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఉన్న 80 ఏళ్ల అతను వైరస్ బారినపడ్డారు. సోమవారం కన్నుమూశాడు. న్యూసౌత్ వేల్స్‌లో ఈ తొలి మరణం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

భయాందోళన జనం
మరో వైపు ఆస్ట్రేలియాలో రోజువారి కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. న్యూసౌత్ వెల్స్, క్వీన్ లాండ్, విక్టోరియా రాష్ట్రాల్లో మొత్తం నిన్న ఒక్కరోజే 9,107 కరోనా కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. క్విన్స్ ల్యాండ్ కు వెళ్లేవారు తప్పనిసరిగా పీసీఆర్ పరీక్షల రిపోర్టును చూపించాలని తెలిపారు. తాజాగా ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మృతి చెందడంతో ఆంక్షలను మరింత కఠిన తరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రాన్స్‌లో కరోనా విజృంభణ
మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై డబ్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. యూరప్ దేశాల్లో పరిస్థితి చేజారేలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 108 దేశాలకు ఈ మహమ్మారి పంజా విసిరింది. ప్రాన్స్‌లో ఒక్కరోజే తొలిసారిగా లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో అంక్షలు కఠిన తరం చేసింది. రాత్రి క్లబ్‌లు మూసివేసింది. రెస్టారెంట్టు, సినిమా హాళ్లలో ఆరుగురికి మించి గుమికూడదని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మించి ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది.

అమెరికాలో రోజుకు 2లక్షలకుపైగా కేసులు
అమెరికాలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. వారం రోజులుగా సగటున రోజుకు రెండు లక్షల చొప్పున కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి 19 నుంచి ఈ స్థాయి కేసులు కన్పించలేదు. దేశంలో ఇదే పరిస్థితి కొనసాగితే రోజుకు 10 లక్షల కేసులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క సారిగా కరనా కేసులు పెరగడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications