గాల్లో..ఎదురెదురుగా ఢీ కొట్టుకున్న తేలికపాటి విమానాలు
న్యూయార్క్: పర్యాటకులను తీసుకెళ్తున్న రెండు తేలికపాటి విమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్న ఘటన అలస్కాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. అలస్కాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కెట్చికాన్ పట్టణం గగనతలంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.
నీటి మీద కూడా ప్రయాణించగల తేలికపాటి విమానాలు అవి. ఫ్లోట్ ప్లేన్స్ అని పిలుస్తారు. ప్రిన్సెస్ నౌక నుంచి పర్యాటకులను సమీపంలోని ఓ ద్వీపానికి తీసుకెళ్లడానికి ఈ విమానాలను ఉపయోగించారు. పర్యాటకుల సౌకర్యం కోసం ఎయిర్ ట్యాక్సీ సర్వీసులుగా వాటిని విస్తారంగా అందుబాటులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.

క్రూయిజ్ షిప్ నుంచి 11 మంది పర్యాటకులతో బయలుదేరిన హావిలాండ్ ఒట్టార్ డీహెచ్సీ-3 అనే తేలికపాటి విమానం టేకాఫ్ తీసుకుని, గాల్లోకి ఎగిరింది. అదే సమయంలో హావిలాండ్ ఒట్టార్ డీహెచ్సీ-2 అనే మరో విమానం క్రూయిజ్ షిప్‌పై ల్యాండ్ అవుతుండగా- రెండు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. దీనితో డీహెచ్‌సీ-3 విమానంలో ప్రయాణిస్తున్న 10 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. డీహెచ్‌సీ-2 పర్యాటకుల్లో అయిదు మంది దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల సరైన కారణాలు తెలియరాలేదు. ఆకాశం దట్టమైన మేఘాలతో అలుముకుని ఉండటం ప్రమాదానికి ఓ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
-
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. ఆరు సార్లు ఎంపీగా సేవలు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం: పీఎం మోదీ ఆందోళన.. ఇండియాలో ఈ వస్తువుల ధరాఘాతం! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
ఈ టైమ్ లో కిమ్ ఎంటర్ అయితే ఉంటది నా సామిరంగ- ఊ అంటే చాలు -
Weather: నాలుగు రోజుల్లో వానలు.. నిప్పులు కురిపిస్తున్న భానుడు! -
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..! తాజా ఉత్తర్వులు..! -
Donald Trump: గల్ఫ్ దేశాల్లో షాకులతో ట్రంప్ బిగ్ యూటర్న్..! ఇరాన్ పై తాజా ప్లాన్ ..! -
16 ఏళ్ల తర్వాత బెస్ట్ ఫ్రెండుతో కలిసి పవన్ కళ్యాణ్ మూవీ..! -
viral video: యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ లో పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం..












Click it and Unblock the Notifications