ఉక్రెయిన్ వార్ లో భారీ ఎదురుదెబ్బలు-తొలిసారి అంగీకరించిన రష్యా-తీవ్ర విషాదమని వెల్లడి
ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టి నెలన్నర రోజుల్లో రష్యాకు భారీగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంత సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇప్పటికీ చెప్పలేని పరిస్ధితి. దీనంతటికీ కారణం ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనే. దీన్ని రష్యా తొలిసారి అంగీకరించింది.
ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో కఠినమైన ప్రతిఘటనను ఎదుర్కొన్న రష్యా తన దండయాత్రపై పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా అత్యంత భయంకరమైన అంచనాల్ని ప్రకటించింది. ఈ యుద్ధంలో తమ సైనికులు భారీగా నష్టపోయినట్లు వెల్లడించింది. దీన్నో భారీ విషాదంగా అభివర్ణించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పెరుగుతున్న మరణాల సంఖ్యపై విచారం వ్యక్తం చేశారు. తాము భారీగా బలగాల్ని కోల్పోతున్నట్లు ఆయన విచారం వ్యక్తంచేశారు. ఇది తమకు తీవ్ర విషాదమన్నారు.

Recommended Video
మాస్కో ఆరు వారాల సుదీర్ఘ దండయాత్రలో 4 మిలియన్లకు పైగా ప్రజలు విదేశాలకు పారిపోయారు. వేలాది మంది మరణించడమో, గాయపడటమో జరిగింది. నగరాలు శిధిలాలుగా మారాయి. అలాగే రష్యన్ నేతలు, కంపెనీలపై ఆంక్షల కత్తి వేలాడుతోంది. దీన్నో ప్రతీకాత్మక చర్యగా పరిగణిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేసింది. ఉక్రెయిన్ లో మానవ హక్కుల ఉల్లంఘన, మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత రష్యా కౌన్సిల్ నుంచి వైదొలిగింది. మరోవైపు ఉక్రెయిన్ లో తమ దాడి కోరుకున్నంత త్వరగా ముందుకు సాగడం లేదని మాస్కో ఇప్పటికే అంగీకరించింది.
పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా మూడు దశాబ్దాల పాటు అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ ప్రకటించారు. యూఎస్ కాంగ్రెస్ దాని అత్యంత అభిమాన దేశం వాణిజ్య హోదాను తొలగించడం మరో దెబ్బగా మారుతోంది. ఉక్రెయిన్‌ను సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఫిబ్రవరి 24న తాము "ప్రత్యేక సైనిక ఆపరేషన్" ప్రారంభించామని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్, దాని పాశ్చాత్య మిత్రులు దానిని తప్పుడు సాకుగా చూపి తిరస్కరించారు. దీంతో రష్యాకు ఇబ్బందులు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications