Bird Flu: డేంజర్ బెల్స్.. ఇండియా నుంచి వెళ్లిన చిన్నారికి బర్డ్ ఫ్లూ..!
బర్డ్ ప్లూ అనేది పక్షులకు మాత్రం వస్తుందని అందరికి తెలుసు. కానీ.. ప్రపంచంలో తొలిసారిగా మానవుడికి కూడా బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో తీవ్ర ఆందోళనలు నెలకున్నాయి. పలు మీడియా నివేదికల ప్రకారం ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన ఓ చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు చెబుతున్నారు.
"విక్టోరియాలోని ఒక చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకింది. ఇది ఆస్ట్రేలియాలోనే మొదటి కేసు. ఆ పిల్లవాడు భారతదేశంలో ఉన్నప్పుడు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా A (H5N1) ఇన్‌ఫెక్షన్‌ను సోకినట్లు తెలుస్తోంది. అతను ఈ సంవత్సరం మార్చిలో అస్వస్థతకు గురయ్యాడు" అని 9news.com.au ఉటంకిస్తూ పేర్కొంది. "బర్డ్ ఫ్లూ" అని కూడా పిలవబడే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా A(H5N1) ఇన్ఫెక్షన్ మానవుడికి సోకడం ఇదే తొలిసారి అని వివరించింది.

"బర్డ్ ఫ్లూ విక్టోరియాలో వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అదనపు కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇది వ్యక్తుల మధ్య సులభంగా వ్యాపిస్తుంది" అని విక్టోరియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ X లో పోస్ట్ చేసింది." మార్చి 2024లో విదేశాల నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన పిల్లవాడికి బర్డ్ ఫ్లూ సోకింది. ఆ పిల్లవాడు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొన్నాడు. కానీ పూర్తిగా కోలుకున్నాడు" అని దేశం పేరు ఎత్తకుండా మరొక పోస్ట్‌లో పేర్కొంది.
"కాంటాక్ట్ ట్రేసింగ్ ఈ కేసుతో సంబంధం ఉన్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులను గుర్తించలేదు. అదనపు మానవ కేసులు 'చాలా తక్కువ' అని డిపార్ట్‌మెంట్ కమ్యూనిటీకి భరోసా ఇచ్చింది. వ్యాధి సోకిన పక్షులు లేదా జంతువులతో లేదా వాటి స్రావాలతో సంబంధం కలిగి ఉంటే తప్ప మానవులకు ఈ వైరస్ వచ్చే ప్రమాదం లేదు. అరుదుగా, మానవులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఇన్‌ఫెక్షన్ సుదీర్ఘమైన పరిచయంతో మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది " అని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC)లోని ఒక నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications