వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా2022: టాప్ లో ఎలాన్ మస్క్; ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీల స్థానాలివే!!

|
Google Oneindia TeluguNews

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. 36 వ వార్షిక ర్యాంకింగ్ వివరాలను వెల్లడించింది. ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో మొత్తం 2668 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక వీరందరి ఆస్తులు సుమారు 12.7 ట్రిలియన్ల డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ పేర్కొంది. 2021 సంవత్సరంతో పోలిస్తే ఇది 400 బిలియన్ డాలర్లు తక్కువ అని తెలుస్తుంది.

ఫోర్బ్స్ జాబితాలో టాప్ లో అమెరికా.. అమెరికాకు చెందిన 735 మంది

ఫోర్బ్స్ జాబితాలో టాప్ లో అమెరికా.. అమెరికాకు చెందిన 735 మంది

ఫోర్బ్స్ జాబితా నుంచి రష్యా, చైనా దేశాలకు చెందిన సుమారు 34 మంది ఈసారి తగినట్లుగా సమాచారం. ఏడాది క్రితంతో పోలిస్తే సుమారు వెయ్యి మంది బిలియనీర్లు ఈ ఏడాది మరింత సంపన్నులుగా మారినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇదిలాఉంటే అమెరికాకు చెందిన 735 మంది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. వారి సంపాదన సుమారుగా 4.7 ట్రిలియన్ల డాలర్లు ఉందని సమాచారం. ఇక ఈ జాబితాలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు.

ప్రధమ స్థానంలో ఎలాన్ మస్క్, టాప్ 15 లో ఉంది వీరే

ప్రధమ స్థానంలో ఎలాన్ మస్క్, టాప్ 15 లో ఉంది వీరే

ప్రస్తుతం విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఎలాన్ మస్క్ ప్రథమ స్థానంలో ఉన్నారు. స్పేస్‌ఎక్స్ మరియు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఏడాది అగ్రస్థానం నుంచి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను పడగొట్టారు. ఆ తర్వాతి స్థానంలో జెఫ్ బేజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫ్యామిలీ, తర్వాతి స్థానంలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ , లారీ ఫేజ్, సర్గే బ్రిన్, లారీ ఎలిసన్, స్టీవ్ బార్మర్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, మైఖేల్ బ్లూంబర్గ్, కార్లోస్ స్లిమ్ హేలూ, ఫ్రాంకోస్ బేటన్ కోర్ట్ మేయర్ అండ్ ఫ్యామిలీ, మార్క్ జూకర్బర్గ్ లు ఉన్నారు. భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో పదవ స్థానంలో నిలువగా, 11వ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు.

భారతీయ టాప్ 10 సంపన్నులు వీరే

భారతీయ టాప్ 10 సంపన్నులు వీరే

ఇక ప్రపంచ సంపన్నుల జాబితాలో స్థానం దక్కించుకున్న భారతదేశ టాప్ టెన్ సంపన్నులను చూస్తే మొదటి స్థానంలో అంబానీ నిలువగా రెండవ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఇక మూడవ స్థానంలో శివ నాడార్, నాలుగవ స్థానంలో సైరస్ పూనవాల్లా, ఐదవ స్థానంలో డీమార్ట్ అధినేత రాధాకిషన్, ఆరవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ ఏడవ స్థానంలో సావిత్రి జిందాల్, ఎనిమిదవ స్థానంలో కుమార మంగళం బిర్లా, 9వ స్థానంలో సన్ ఫార్మాస్యూటికల్స్ దిలీప్ శంగ్వీ పదవ స్థానంలో కోటక్ మహింద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కోటక్ నిలిచారు .

రష్యా, చైనాలలో గణనీయంగా పడిపోయిన బిలియనీర్ల సంఖ్య

రష్యా, చైనాలలో గణనీయంగా పడిపోయిన బిలియనీర్ల సంఖ్య

ఫోర్బ్స్ తెలిపిన ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, కరోనా మహమ్మారి మరియు నిదానమైన మార్కెట్లు అత్యంత సంపన్నులను తాకాయి. దీంతో గతంలో సంపన్నులుగా ఉన్న వారు ఇప్పుడు జాబితాలో కొందరు స్థానాన్ని కోల్పోయారు . అయితే 1,000 మంది బిలియనీర్లు ఏడాది క్రితం కంటే ఇప్పుడు ధనవంతులుగా ఉన్నారు. రష్యా మరియు చైనాలలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ .. తగ్గిన రష్యా బిలియనీర్ల సంఖ్య

ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ .. తగ్గిన రష్యా బిలియనీర్ల సంఖ్య


వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యాలో గత ఏడాది కంటే 34 మంది బిలియనీర్లు తక్కువగా ఉన్నారు మరియు ఫోర్బ్స్ ప్రకారం, టెక్ కంపెనీలపై ప్రభుత్వ అణిచివేత తర్వాత 87 మంది తక్కువ చైనీస్ బిలియనీర్లు ఉన్నారు. తాము నికర విలువలను లెక్కించడానికి మార్చి 11, 2022 నుండి స్టాక్ ధరలు మరియు మారకపు ధరలను ఉపయోగించామని వ్యాపార పత్రిక ఫోర్బ్స్ పేర్కొంది.

English summary
Forbes richest List 2022 Released. Elon Musk topped the list. Mukesh Ambani was tenth and Gautam Adani was in 11th place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X