వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pope Benedict XVI : మాజీ పోప్ బెనెడిక్ట్ 16 ఇక లేరు- వాటికన్ ప్రకటన..

|
Google Oneindia TeluguNews

క్రైస్తవుల మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్ 16 ఇవాళ కన్నుమూశారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించినట్లు వాటికన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రోమ్ సహా ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది విషాదంలో మునిగిపోయారు. వాటికన్ ప్రకటన తర్వాత ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా మాజీ పోప్ మరణంపై స్పందిస్తున్నాయి.

గత ఆరు దశాబ్దాల్లో తన పదవికి రాజీనామా చేసిన తొలి పోప్ గా బెనెడిక్ట్ 16 నిలిచారు. పోప్ బెనెడిక్ట్ XVI గా పనిచేసిన ఎమెరిటస్.. ఇవాళ వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో 9:34 గంటలకు కన్నుమూసినట్లు వాటికన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ ఒక ప్రకటన చేశారు. బెనెడిక్ట్ 16 జర్మన్ పోప్ ఎమెరిటస్. అతని జన్మ పేరు జోసెఫ్ రాట్‌జింగర్. ఫిబ్రవరి 2013లో పదవీవిరమణ చేయాలనే దిగ్భ్రాంతికరమైన నిర్ణయం తర్వాత వాటికన్ మైదానంలో ఉన్న మాజీ కాన్వెంట్‌లో ఆయన నిశ్శబ్ద జీవితాన్ని గడుపుతున్నారు.

Former Pope Benedict XVI passed away, announced vatican church

అయితే రాజీనామా తర్వాత మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని వాటికన్ తాజాగా వెల్లడించింది. అయితే ఆయన వారసుడు పోప్ ఫ్రాన్సిస్ అతని కోసం ప్రార్థించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులకు పిలుపునిచ్చారు. మాజీ పోప్‌లకు రూల్‌బుక్ లేనప్పటికీ.. బెనెడిక్ట్ అంత్యక్రియలు ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్‌లో జరగాలని భావిస్తున్నారు. 2005లో మరణించిన చివరి పోప్ అయిన జాన్ పాల్ II మృతదేహానికి సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దేశాధినేతలతో సహా మిలియన్ మంది ప్రజల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

బెనెడిక్ట్ ఓ అద్భుతమైన వేదాంతవేత్తగా పేరు తెచ్చుకున్నారు. కానీ వాటికన్ లో అంతర్గత పోరుతో పాటు, పిల్లలపై మతాధికారుల లైంగిక వేధింపుల వ్యవహారం కూడా ఆయన్ను చుట్టుముట్టింది. దీంతో ఆయన నాయకత్వ లోపంపై విమర్శలు వచ్చాయి. చివరికి దశాబ్దం క్రితం ఆయన పోప్ పదవి నుంచి తప్పుకున్నారు.

English summary
vatican has annouced that former pope benedict xvi has been passed away today at the age of 95 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X