మంచుతుఫానుకు గడ్డకట్టుకుపోతున్న అమెరికా

వాషింగ్టన్: ఆర్కిటిక్ ద్రువం నుంచి చెలరేగిన మంచుతుఫాను అమెరికాను కమ్మేసింది. అమెరికాలోని 50 రాష్ట్రాలూ మంచులోకూరుకుపోయాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలు మంచులో కూరుకుపోయాయి. అన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై పాత రికార్డులను చెరిపేస్తున్నాయి. మోంటానాలో అత్యధికంగా మైనస్ 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇలినాయిస్, ఇండియానా, అయోవా, మేరీలాండ్, మిచిగాన్, నెబ్రాస్కా, ఉత్తర డకోటా, ఓహియో, పెన్సిల్వేనియా, దక్షిణ డకోటా, పశ్చిమ వర్జీనియా వంటి రాష్ట్రాల్లో మైనస్ 40 నుంచి మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

న్యూయార్క్ సెంట్రల్‌పార్క్ ప్రాంతంలో మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతతో 118 ఏళ్ల రికార్డు బద్దలయింది. అటు.. మిచిగాన్‌లో మైనస్ 26, ఎంబర్రాస్ (మిన్నెసొటా)లో మైనస్ 37 డిగ్రీలు, చికాగోలో మైనస్ 26 డిగ్రీలు, విస్కాన్సిన్‌లో మైనస్ 21 డిగ్రీలు, బర్మింగ్‌హామ్ (అలబామా)లో మైనస్ 14 డిగ్రీలు, అట్లాంటాలో మైనస్ 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Freeze spread to southern states, 21 dead in US

హవాయిలోని మానా కీ అనే అగ్నిపర్వతం వద్ద కూడా మైనస్ 7 డిగ్రీలకు చేరుకుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఫ్లోరిడా, కాలిఫోర్నియాల్లో సైతం గడ్డక ట్టేంత చలి వణికించింది. మరోవైపు చికాగో లింకన్ జూ పార్క్‌లో ద్రువ ప్రాంతాల చలిని తట్టుకోగల ద్రువపు ఎలుగుబంటి ఒకటి ప్రస్తుత చలిని తట్టుకోలేక బయటకు కూడా రాకుండా ఎన్‌క్లోజర్‌లోనే ఉండిపోయిందంటే చలి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Freeze spread to southern states, 21 dead in US

గత ఐదు రోజుల్లో మొత్తం 11 వేల విమానాలు రద్దయిపోయాయి. డెట్రాయిట్ నుంచి చికాగోకు వెళ్తున్న రైలు ఆగిపోవడంతో అందులో 500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రాత్రంతా చలికి వణుకుతూ నిద్రకు దూరమయ్యారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పలు పాఠశాలలను, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పైపుల్లో నీళ్లు సైతం గడ్డకట్టిపోయాయి.

రోడ్లన్నీ మంచుదిబ్బలుగా మారిపోయాయి. మంచు కారణంగా విద్యుత్‌కేంద్రాల పనితీరు దెబ్బతినడంతో ఇండియానాలో 15 వేల మంది కరెంటు లేక బాధపడ్డారు. మొత్తం 19 కోట్ల మంది అమెరికన్ల జీవితాలను కింద మీద చేసింది. మంచుతుఫానుకు 21 మంది మరణించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+