వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ‘భద్రకాళి’(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలోని ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఒక్కసారిగా రౌద్రరూపం దాల్చింది. ఈ 102 అంతస్తుల ఆకాశహర్మ్యంపై కాళికాదేవి చిత్రాన్ని ప్రొజెక్ట్ చేశారు. న్యూయార్క్‌లో బుధవారం రాత్రి ప్రొజెక్టర్ సాయంతో ఆ శక్తి స్వరూపిణి చిత్రాన్ని ఆకాశమంత ఎత్తున ఆవిష్కరించారు.

ఈ భద్రకాళి చిత్రాన్ని ఆండ్రూ జోన్స్ అనే ఆర్టిస్టు రూపొందించాడు. 'భద్రకాళి' ప్రొజెక్షన్ అద్భుతాన్ని న్యూయార్క్ వాసులు, పర్యాటకులు ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆకాశంలో కాళికాదేవి ప్రత్యక్షమైందా? అన్న భ్రాంతిని కలిగించేలా ఈ ప్రొజెక్షన్ ఉండడం విశేషం.

కాలుష్యం, వినాశనం తదితరాలపై పోరాడేందుకు ప్రకృతికి ఓ భీకరమూర్తి అవసరం అన్న కోణంలో ఈ కాళికా మాత కాన్సెప్ట్ రూపొందించారు. అంతకుముందు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై.. అంతరించిపోతున్న ప్రాణులు, అమెరికా డెంటిస్టు బాణాలకు ప్రాణాలు వదిలిన సింహం సెసిల్‌ను కూడా ప్రొజెక్ట్ చేశారు.

English summary
Goddess Kali, the epitome of tremendous power and strength took over on the Empire State Building in New York.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X