నాడు విరాళాలిచ్చి, నేడు వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ పై టెక్ దిగ్గజాల తీరిలా..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తోన్న టెక్ కంపెనీలు ఆయన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో నగదు, సర్వీసు రూపంలో విపరీతంగా ఖర్చు చేశాయని చెప్పారు
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న టెక్ కంపెనీలు, ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో విరాళాల రూపంలో విపరీతంగా ఖర్చు చేశాయి.
గత మాసంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించారు.ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి నగదు, సర్వీసుల రూపంలో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు విరాళాల రూపంలో విపరీతంగా ఖర్చు చేశాయని పొలిటికో రిపోర్ట్ చేసింది.
మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక్కటే సుమారు 2,50,00 లక్షల డాలర్లను అంటే రూ.1,67,62,12 లను విరాళంగా ఇచ్చిందని తెలిపింది. అదే మొత్తంలో తన సర్వీసులను కూడ అందజేసిందని తెలిసింది.
అయితే ఫేస్ బుక్ మాత్రం ఎలాంటి విరాళం ఇవ్వలేదని తెలిపింది. కానీ ఇన్ స్టాగ్రామ్ ఫోటోల రూపంలో సహయం చేసిందని రిపోర్ట్ చేసింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన వారం రోజుల్లోపుగానే ఆయన తీసుకొన్న నిర్ణయాలను నిరసిస్తూ ఈ కంపెనీలు తమ నిరసన గళాన్ని విప్పాయి.
కొన్నేళ్ళుగా కార్పోరేట్ కంపెనీలు అమెరికా ప్రారంభోత్సవ కమిటీకి విరాళాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రెండో సారి ప్రారంభోత్సవ సమయంలో మైక్రోసాఫ్ట్ 2 మిలియన్ డాలర్ల నగదు, సర్వీసులను విరాళంగా ఇచ్చింది.












Click it and Unblock the Notifications