Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రహస్య పత్రాల కేసు: మియామి కోర్టులో డొనాల్డ్ ట్రంప్, కీలక పరిణామాలు

మాయామి: రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మంగళవారం మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక పత్రాలను తన నివాసంలో దాచిపెట్టారనే ఆరోపణలను ట్రంప్​ తోసిపుచ్చారు. మంగళవారం కోర్టుకు హాజరైన డొనాల్డ్‌ ట్రంప్.. విచారణ సందర్భంగా తనపై మోపిన అభియోగాలను ట్రంప్ తిరస్కరించారు.

ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు ఆదేశాలు వెలువడతాయనే ప్రచారం జరిగినా.. ఎలాంటి షరతులు లేకుండానే.. ఆయన కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. ట్రంప్​ కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక క్యూబన్​ రెస్టారెంట్​లో తన మద్దతుదారులతో కలిసి సరదాగా గడిపారు. అయితే న్యాయవిచారణ సందర్భంగా మీడియాను అనుమతించకపోవడంపై పాత్రికేయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అంతకుముందు పరిణామాలను గమనించినట్లయితే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ రక్షణ రహస్యాలను చట్టవిరుద్ధంగా భద్రపరిచారని, న్యాయాన్ని అడ్డుకున్నారని ఫెడరల్ క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు మియామీ కోర్టుకు వచ్చారు. ఒక చారిత్రాత్మక క్రిమినల్ కేసులో మాజీ యూఎస్ అధ్యక్షుడు అత్యంత రహస్య ప్రభుత్వ పత్రాలను దాచిపెట్టారని, వాటిని సందర్శకులకు చూపించారని, పరిశోధకుల నుంచి దాచడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలున్నాయి.

 US former president Donald Trump Under Arrest and Booked in Secret Document Case

ట్రంప్ ఉద్దేశపూర్వకంగా క్లాసిఫైడ్ రికార్డులను తన వద్ద ఉంచుకున్నారని ఆరోపించిన 37 నేరాల గణనలను కోర్టులో ఆయన తిరస్కరించాలని భావిస్తున్నారు. దానిని బహిర్గతం చేస్తే జాతీయ భద్రతకు హాని కలుగుతుందని ప్రాసిక్యూటర్లు అంటున్నారు. బహుళ-సంవత్సరాల జైలు శిక్షకు అవకాశం ఉన్నందున ఈ కేసు తీవ్ర చట్టపరమైన పరిణామాలను కలిగిస్తుంది.

కాగా, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ.. కోర్టుకు హాజరైన మాజీ అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. ట్రంప్ కోర్టుకు హాజరు కావడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి. ఓ పోర్న్ స్టార్ అనైతిక ఒప్పందాల వ్యవహారంలో ఏప్రిల్‌లో ఆయన న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాజాగా, కీలక రక్షణ శాఖకు సంబంధించిన పత్రాల వ్యవహారంలో ఇప్పుడు హాజరయ్యారు.

భారత కాలమానం ప్రకారం. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆయన మియామీ కోర్టుకు హాజరయయారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రహస్య పత్రాలను దాచినందుకు గానూ మొత్తం 37 నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. అందులో గూఢచర్యం, నిబందనల ఉల్లంఘన, రక్షణ సమాచారాన్ని అనధికారికంగా కలిగి ఉండటం లాంటి తీవ్ర నేరాలు ఉన్నాయి. వీటితోపాటు న్యాయాన్ని అడ్డుకునే కుట్ర కూడా ఉంది.

ఒకవేళ ట్రంప్ దోషిగా తేలితే.. గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తనపై కుట్ర జరుగుతోందని ట్రంప్ చెబుతున్నారు. తనకు కోర్టులో శిక్ష పడినా కూడా తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+