వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ ఎఫెక్ట్ : ఖననం చేసేందుకు చోటు లేదు..చర్చీల్లో పెరిగిపోతున్న శవపేటికలు

|
Google Oneindia TeluguNews

ఇటలీ: కరోనావైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని హూబే ప్రావిన్స్‌లో బయటపడ్డ ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో కొన్ని వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకోగా ఇతర దేశాల్లో కూడా స్వైర విహారం చేస్తోంది. ప్రస్తుతం ఇటలీ దేశంలో కూడా మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతలా అంటే... ఏకంగా చైనాలోని మృతుల సంఖ్య కంటే ఎక్కువగా ఇటలీలోనే ఉంది.

 బెర్గామో నగరంలో ...

బెర్గామో నగరంలో ...

కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఇటలీలోనే ఉంది. ఇప్పటికే కొన్ని వందల మంది మృతి చెందారు. ఇటలీ దేశమంతా నిర్మానుష్యంగా మారింది. మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానాలు చాలడం లేదు. బెర్గామో నగరంలో మృతులు సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానాలు సరిపోలేదని సమాచారం. అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే కరోనావైరస్ ప్రభావం ఇటలీలో ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇది మరో ఆరునెలల పాటు కొనసాగితే ఇక సామూహిక ఖననానికి సిద్ధం కావాల్సి ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు.

ఒక్కరోజులోనే 627 మంది మృతి..

శుక్రవారం ఒక్క రోజునే 627 మంది ఇటలీలోలో చనిపోయారు. దీంతో అక్కడి మృతుల సంఖ్య 4032కు చేరింది. మరో 5150 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇక బర్గామో నగరంలో అత్యధిక కరోనావైరస్ కేసులు బయటపడ్డాయి. ఇక్కడి నుంచి ఇటలీ దేశవ్యాప్తంగా వైరస్ పాకిందని భావిస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్న మృతుల సంఖ్య కంటే ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు

ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు

మార్చి ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకు 164 మంది ఈ నగరం నుంచి మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ఇక మృతి చెందిన వారికి స్మశానంలో చోటు లేక చాలా మృతదేహాలు కలిగి ఉన్న శవపేటికలు అక్కడి స్థానిక చర్చీల్లో ఉన్నాయి. ఇక అక్కడి స్మశానవాటికలు 24 గంటలు పనిచేస్తున్నాయి. సిబ్బంది కూడా నిత్యం పనిచేస్తూ కనిపిస్తున్నారు. రోజుకు 40 మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు స్మశానవాటిక సిబ్బంది చెబుతోంది. ఇలాంటి మహమ్మారి వల్ల ఇంతమంది మృతి చెంది స్మశానాలకు చేరడం ఇదే తొలిసారని ఓ కాటికాపరి చెప్పాడు. ఇప్పటికే తాను 95 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పాడు. అయితే ఈ అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా జరగలేదని చెప్పారు.

English summary
The image of Italian army trucks escorting coffins as a local crematorium was unable to cope with the number of bodies coming in shocked the citizens in Bergamo city this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X