తుపాకీ టెర్రర్: అమెరికాలో మళ్లీ కాల్పులు.. పిట్టల్లా కాల్చిపారేశాడు..

Subscribe to Oneindia Telugu

కాలిఫోర్నియా: అమెరికాలో తుపాకీ మోతలు ఆగడం లేదు. ఇటీవలి కాల్పుల ఘటనలు మరిచిపోకముందే మరో వ్యక్తి తుపాకీతో స్వైర విహారం చేశాడు. భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి 11:30 గం. సమయంలో ఉత్తర కాలిఫోర్నియాలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఉత్తరకాలిఫోర్నియాలోని రెడ్ బ్లఫ్ గ్రామీణ ప్రాంతంలో.. దుండగుడు తొలుత ఓ ఇంటిపై కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. ఆ వెంటనే సమీపంలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరుపుతూ వెళ్లాడు. కనిపించినవారిని కనిపించినట్టు కాల్చిపారేశాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పదులకొద్ది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

Gunman sprays bullets into school, terrorized small town in mass shooting that left 5 dead

మారణాయుధాలు కలిగి ఉన్న అతన్ని అదుపు చేయడం కష్టమని భావించిన లా-ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది.. దుండగుడిని హతం చేశారు. నిందితుడిని కెవిన్ అనే వృద్దుడిగా గుర్తించారు. గతంలో ఉద్యోగం పోయిందని ఒకరు, పిచ్చెక్కి మరొకరు కాల్పులు జరపగా.. తాజాగా కెవిన్ కాల్పుల వెనుక మర్మం అంతుచిక్కలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gunman's deadly rampage through rural Rancho Tehama on Tuesday was stopped when police rammed his vehicle and exchanged in a fierce gun battle, authorities said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి