కాబూల్ గన్‌మెన్ కాల్పులు: 14 మంది మృతుల్లో ఎపి డాక్టర్
కాబూల్: కాబూల్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లోకి ఓ సాయుధులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. మృతుల్లో నలుగురు భారతీయులు, ఓ అమెరికన్ తోపాటు పలువురు విదేశీయులున్నాన్నారు. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన డాక్టరు సతీష్‌చంద్ర మరణించారు. ఈ సంఘటనతో డాక్టరు బంధుమిత్రులు విషాదంలో మునిగారు.
కాల్పులు జరిపిన సాయుధులు ఎవరనేది తెలియడం లేదు. సాయుధులు దాడి చేయడంతో గెస్ట్‌హౌస్‌లో పలువురు విదేశీయులు చిక్కుబడి పోయారు. గంటల తరబడి గెస్ట్‌హౌస్ సాయుధుల చెరలో ఉంది.
ఏడు గంటల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. మధ్య మధ్యలో కాల్పుల శబ్దాలు వినిపిస్తూ వచ్చాయి. సాయుధులు గెస్ట్‌హౌస్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న సమయంలో అధికారులు దాన్ని చుట్టుముట్టారు.

కాల్పుల్లో 14మంది మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని కాబూల్ పోలీసు చీఫ్ అబ్దుల్ రహ్మాన్ చెప్పారు. పోలీసులు ఓ సాయుధుడిని కాల్పి చంపినట్లు తెలిపారు.
సాయుధులు దాడి చేసిన సమయంలో గెస్ట్‌హౌస్‌లో 44 మంది ఉన్నారు. ఆ సమయంలో ఓ సంగీత ప్రదర్శన కూడా జరుగుతోంది. కొంత మంది అక్కడ ఉండగా, మరికొంత మంది రాత్రిపూట భోజనాలు చేస్తున్నారు. ఈ సయమంలో సాయుధులు దాడి చేశారు .












Click it and Unblock the Notifications