వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంటల్లో కాలిపోతున్న ఆసుప్రతిలో హార్ట్ సర్జరీ.. రోగిని కాపాడేందుకు రిస్క్ చేసిన రష్యా డాక్టర్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చెక్కతో చేసిన ఆస్పత్రి పైకప్పుకు అంటుకున్న మంటలు ఆర్పడానికి ఫైన్ ఇంజిన్లు పరుగులు తీశాయి

రష్యాలో ఒక ఆసుపత్రి లోపల డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో బయట మంటలు చెలరేగాయి.

వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది రంగంలోకి దిగి, ఆ పురాతన ఆసుపత్రి భవనం పైకప్పుకు అంటుకున్న మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

భవనంలో ఉన్న 120 మందికి పైగా జనాలను అక్కడనుంచి తరలించారు.

రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న బ్లాగోవేషెన్స్క్ ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.

అయితే, ఆస్పత్రి భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో జరుగుతున్న హార్ట్ సర్జరీకి ఏ ఆటంకం రాకుండా అత్యవసర ఎలక్ట్రిసిటీ కేబుల్ సహాయపడింది.

మంటల నుంచి వస్తున్న పొగ ఆపరేషన్ థియేటర్‌లోకి చేరకుండా ఫ్యానులు అడ్డుకున్నాయి.

సర్జరీ నిర్విఘ్నంగా పూర్తయ్యింది. ఆపరేషన్ పూర్తయిన తరువాత ఆ రోగిని అక్కడ నుంచి తరలించారు.

"రోగిని కాపాడడమే మా టీమ్ లక్ష్యం. అందుకు శాయశక్తులా కృషి చేశాం" అని ప్రధాన సర్జన్ వాలెంటిన్ ఫిలటావ్ తెలిపారు.

రెండు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఎనిమిది మంది డాక్టర్లు, నర్సులు పాలుపంచుకున్నారు.

సర్జరీ ప్రారంభించిన కొద్ది సేపట్లోనే అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ ఆస్పత్రి భవనం 1907లో జారిస్ట్ యుగంలో నిర్మించినదని, చెక్కతో కట్టిన భవనం పైకప్పు అంటుకోవడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని రష్యా ఎమర్జెన్సీస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మంటలు ఆపుతున్న అగ్నిమాపక సిబ్బంది

షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ధైర్యంగా లోపల సర్జరీ నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని, సమయానికి అక్కడకు చేరి మంటలు ఆర్పడంలో సఫలమైన అగ్నిమాపక బృందాన్ని ఆమూర్ స్థానిక గవర్నర్ వాసిలీ ఆర్లోవ్ ప్రశంసించారు.

ఆ ప్రాంతంలో స్పెషలిస్ట్ కార్డియాలజికల్ యూనిట్ ఉన్న ఆస్పత్రి ఇదొక్కటే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Heart surgery in a burning hospital,Russian doctors risk to save patient
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X