రష్యా, ఉక్రెయిన్, అమెరికా.. తొలి త్రైపాక్షిక భేటీ..
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడున్నరేళ్లుగా నడుస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈలో జనవరి 23 నుండి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దావోస్ అంతర్జాతీయ సదస్సు వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనుంది.
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. యూఏఈలో జనవరి 23 నుండి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుందని తెలిపారు. 2022లో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఈ భేటీ జరగనుంది.

అంతకుముందు దావోస్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ముడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యుద్ధాన్ని ముగించాల్సిందేనని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications