గోనె సంచీలోని బాంబులు పేలి 63 మంది దుర్మరణం
నైజీరియా: బాంబు నిల్వచేసిన ప్రాంతంలో పేలుడు జరిగి 63 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన నైజీరియాలోని బౌచీ ప్రాంతంలో జరిగింది. బౌచీ ప్రాంతంలో బొకోహారామ్ ఉగ్రవాదులు నివాసం ఉంటున్నారు. ఇక్కడ జరిగిన బాంబు పేలుళ్లలో అనేక మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.
ఈశాన్య నైజీరియాలోని మాంగునో పట్టణం సమీపంలోని బౌచీ ప్రాంతంలో బొకో హారామ్ ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ బాంబులు ఒక గోనె సంచిలో నిల్వ చేశారు. విషయం గుర్తించిన స్థానికులు గోనె సంచిలో ఏమి ఉన్నాయి అని పరిశీలించడానికి సిద్దం అయ్యారు.

ఆ సందర్బంలో గోనె సంచి పరిశీలిస్తున్న సమయంలో ఒక్క సారిగా పేలిపోయింది. బాంబుల మోతతో ఆ పరిసర ప్రాంతాలు దద్దరలిల్లాయి. మృతదేహాలు చెల్లాచెదురు అయ్యాయి. పలువురి కాళ్లు, చేతులు విరిగిపడ్డాయి. ఈ పేలుడుతో పరిసర ప్రాంతాలలో మాంసపు ముద్దలు పడ్డాయి.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మరణించిన వారు ఆత్మరక్షణ దళ సభ్యలు అని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications