ఆ ట్రక్కు నిండా శవాలే: ఎవరివి?(వీడియో)
హంగేరీ: ఆస్ట్రియాలోని ఓ రహదారిపై ట్రక్కులో పదుల సంఖ్యలో శవాలను గుర్తించారు. హంగేరీ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఈ ట్రక్కును గురువారం గుర్తించినట్లు ఆస్ట్రియా పోలీసు విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. శవాలు బాగా కుళ్లిన స్థితిలో ఉన్నాయని, దీంతో, అవయవాలు తేలిగ్గా విడవడిపోతున్నాయని చెప్పారు.
ఈ కారణంగా, శవాలు ఎన్ని? అన్న దానిపై స్పష్టత రాలేదని పేర్కొన్నారు. 70కి పైగా మృతదేహాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీరందరినీ వలసవాదులుగా భావిస్తున్నారు. వీరిని మరో ప్రాంతానికి అక్రమంగానో, బలవంతంగానో తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.

కాగా, ట్రక్‌పై స్లొవేకియా పౌల్ట్రీ ఉత్పత్తుల కంపెనీ 'హైజా' లోగో ఉంది. నెంబర్ ప్లేట్ మాత్రం హంగేరీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. అయితే, ఆ వాహనం తమది కాదని 'హైజా' ప్రకటించింది. దాన్ని వేరే వ్యక్తులకు విక్రయించామని, అయితే వారు ఆ లోగోను తొలగించలేదని పేర్కొంది.
ఈ వాహనం హంగేరీ నుంచి ఆస్ట్రియాలో ప్రవేశించేటప్పటికే వారందరూ మరణించి ఉంటారని ఆస్ట్రియా పోలీసు విభాగం పేర్కొంది. అయితే, వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది.
ఆ ట్రక్కును నికెల్స్ డార్ఫ్ తరలించారు. అక్కడ శవాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకన్న హంగేరీ పోలీసులు, విచారిస్తున్నారు. కాగా, మొత్తం 71మంది మృతదేహాల్లో 59 పురుషులవి, 8 మహిళలవి, చిన్న పిల్లలవి నాలుగు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications