వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ స్త్రీపట్ల అనుచితంగా: యూకే ప్రభుత్వానికి ఫైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: సోదరిని, సోదరుడిని చూసేందుకు బ్రిటన్ వెళ్లిన గుజరాతీ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన హీత్రూ (లండన్) విమానాశ్రయ సిబ్బందిపై భారీ జరిమానా విధిస్తూ ఆ దేశ హైకోర్టు తీర్పు చెప్పింది. అకారణంగా మహిళను అవమానపరచడమే కాక ఐదు రోజులుగా నిర్బంధించిన కారణంగా ఆమెకు 1.25 లక్షల పౌండ్లను పరిహారంగా చెల్లించాలని ఆ కోర్టు తీర్పు వెలువరించింది.

గుజరాత్‌లో కచ్ జిల్లా గోడ్పార్ గ్రామానికి చెందిన రాధా పటేల్, బ్రిటన్‌లో స్థిరపడిన తన సోదరి, సోదరుడిని చూసేందుకు 2011లో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హీత్రూ విమానాశ్రయానికి వచ్చిన ఆమెను అధికారులు ప్రశ్నలతో సతమతం చేశారు.

Illegally detained at Heathrow: UK court gives Gujarati woman £1.25 lakh

హిందీతో పాటు ఆంగ్లంలోనూ సరిగ్గా మాట్లాడటం కూడా రాదని హేళన చేసిన అధికారులు, ఆమె పాస్‌పోర్టును తీసుకున్నారు. అనంతరం సోదరి, సోదరుడికి సమాచారం ఇవ్వకుండానే ఐదు రోజుల పాటు ఆమెను నిర్బంధించారు. ఎట్టకేలకు వారి బారి నుంచి విముక్తి లభించిన తర్వాత భారత్ తిరిగి వచ్చిన ఆమె విమానాశ్రయ అధికారులపై కేసు దాఖలు చేశారు.

దీనిపై ఆ దేశ కోర్టు సుదీర్ఘ విచారణ జరిపి తుది తీర్పును వెలువరించింది. బాధితురాలిని తీవ్ర మానసిక వేదనకు గురి చేయడమే కాక, అక్రమంగా నిర్బంధించినందున ఆమెకు 1.25 లక్షల పౌండ్ల పరిహారాన్ని చెల్లించాలని యూకే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

English summary
The British high court has asked the UK government to pay a Gujarati woman £1.25 lakh as damages for illegal detention and harassment caused to her by immigration authorities at the Heathrow Airport when she had gone to England some years ago to meet family members. The behaviour of the officials at the airport had turned what was just a family visit into a "nightmare".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X