అమెరికా నౌక చొరబాటుపై భారత్‌ సీరియస్‌- పెంటగాన్‌కు ఫిర్యాదు- ఇరుదేశాల చర్చలు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమకున్న పట్టును నిరూపించుకునేందుకు ఆయా దేశాల పరిధితో సంబందం లేకుండా అమెరికా నేవీ చేస్తున్న యుద్ధనౌక విన్యాసాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత జలాల్లోకి ప్రవేశించి అమెరికా యుద్దనౌక యూఎస్‌ఎస్ జాన్ పాల్‌ జోన్స్‌ చక్కర్లు కొట్టడంపై భారత్‌ సీరియస్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం అమెరికాతో ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకుని పెంటగాన్‌తో సంప్రదింపులు జరిపింది. అమెరికా నేవీ చర్యపై భారత్‌ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే దీంతో వివాదం సద్దుమణిగిందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్దితి.

 అమెరికా దుస్సాహసం

అమెరికా దుస్సాహసం

భారత జలాల్లో లక్షద్వీప్‌కు సమీపంలోని 120 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా నేవీకి చెందిన యుద్ధనౌక యూఎస్‌ఎస్ జాన్ పాల్‌ జోన్స్‌ ఈ నెల 7న అక్రమంగా ప్రవేశించింది. అంతే కాదు అక్కడ చక్కర్లు కొడుతూ విన్యాసాలు నిర్వహించింది. భారత సముద్ర జలాల నిబందనల్ని ఉల్లంఘించి, ఎలాంటి ముందస్తు అనుమతి కూడా లేకుండా ఇలా అమెరికా యుద్దనౌక మన జలాల్లోకి ప్రవేశించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఢిల్లీ వర్గాలు కూడా తీవ్రంగానే స్పందించాయి.

 పెంటగాన్‌కు భారత్ ఫిర్యాదు

పెంటగాన్‌కు భారత్ ఫిర్యాదు

భారత జలాల్లోకి అమెరికా యుద్దనౌక యూఎస్ఎస్‌ జాన్ పాల్‌ జోన్స్‌ ప్రవేశించిన వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న ఢిల్లీ సౌత్‌ బ్లాక్‌ వర్గాలు అమెరికాలోని సైనిక కేంద్రం పెంటగాన్‌ను సంప్రదించాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఇలా అమెరికా యుద్దనౌకలు భారత జలాల్లోకి ప్రవేశించడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పాయి. అయితే గతంలో భారత్‌, అమెరికాతో పాటు అస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్‌ గ్రూప్‌ మద్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగేందుకు తమకు హక్కుందని పెంటగాన్‌ వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

 క్వాడ్‌ గ్రూప్‌ ఒప్పందమే కొంపముంచిందా ?

క్వాడ్‌ గ్రూప్‌ ఒప్పందమే కొంపముంచిందా ?

2007లో భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ క్వాడ్‌ గ్రూప్‌ పేరుతో ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నాలుగు దేశాలూ ఇండో-పసిఫిక్‌ ప్రాంత పరిధిలోకి వచ్చే సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుతంగా సంచరించేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నాయి. అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఈ ఒప్పందం కుదిర్చారు. దీని ప్రకారం ఈ నాలుగు దేశాలు ఎలాంటి పరిమితుల్లేకుండా ఇండో-పసిఫిక్‌ జలాల్లో బహిరంగ, స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక వైఖరి అవలంబించేందుకు అవకాశం దక్కింది. దీంతో ఇప్పుడు అమెరికా భారత జలాల్లోకి ఇచ్చిన ఎంట్రీకి ఈ ఒప్పందాన్నే కారణంగా చూపుతోంది.

 భారత్‌-అమెరికా సంబందాలపై ప్రభావం

భారత్‌-అమెరికా సంబందాలపై ప్రభావం

భారత జలాల్లోకి అమెరికా యుద్దనౌక ప్రవేశించి చక్కర్లు కొట్టిన వ్యవహారంపై అమెరికా-భారత్ మద్య ప్రస్తుతానికి దౌత్య స్దాయిలో చర్చలు జరుగుతున్నాయి. భారత్‌ తన అభ్యంతరాలను అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. అయితే అమెరికా క్వాడ్‌ ఒప్పందం కారణంగా భారత జలాల్లోకి ప్రవేశించే స్వేచ్ఛ తమకుందని చెబుతోంది. దీనిపై ఇరుదేశాల మధ్య ఉన్నతస్దాయిలో చర్చలు జరిగి తదుపరి నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటివరకూ ఈ వివాదం కొనసాగే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఇరుదేశాల మధ్య సంబందాలపైనా ఈ ప్రభావం పడబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+