భారత్ కు కీలక విజయం-గోగ్రా హైట్స్ నుంచి వైదొలిగేందుకు చైనా ఆంగీకారం
భారత్-చైనా మధ్య ఏడాదికి పైగా సాగుతున్న ప్రతిష్టంభన క్రమంగా వీడుతోంది. తూర్పు లడఖ్ లోని భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన కొన్ని కీలక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కోసం జరుగుతున్న చర్చలు ఫలితమిస్తున్నాయి. తాజాగా మిలటరీ అధికారుల మధ్య సాగిన 12వ విడత చర్చల తర్వాత ఇరుదేశాల బలగాలు కీలకమైన గోగ్రా హైట్స్ నుంచి వైదొలగేందుకు అంగీకరించాయి.
Recommended Video
గతేడాది చైనా బలగాలు తిష్టవేసిన ప్రాంతాల్లో ఒకటైన గోగ్రా హైట్స్ లో అప్పటి నుంచీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక్కడ చైనా బలగాలను వెనక్కి తీసుకోవడంపై జరిగిన చర్చల్లో భారత్ కు కీలక పురోగతి లభించినట్లయింది. గోగ్రా హైట్స్ తో పాటు మరికొన్ని సరిహద్దు పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ కోసం ఇరు దేశాలు కొన్నిరోజులుగా చర్చలు జరుపుతున్నాయి. వీటిలో లభించే పురోగతి ఆధారంగానే తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉండటంతో ఇరుదేశాలకు పట్టు విడుపులకు పోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మాల్డో ప్రాంతంలో ఇరుదేశాల సైనికాధికారుల మధ్య దాదాపు 9 గంటల పాటు సాగిన చర్చల్లో ఈ మేరకు గోగ్రా హైట్స్ నుంచి వైదొలగేందుకు చైనా అంగీకరించినట్లు భారత్ వెల్లడించింది. ఆరు నెలల క్రితం ప్యాంగాంగ్ సరస్సు వద్ద నుంచి బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించింది. ఆ తర్వాత బలగాల ఉపసంహరణ ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదే ఊపులో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ దిశగా ఇరు దే్శాలూ అడుగులు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే తర్వాతి దశలో సాగే ఆర్మీ జనరల్ స్ధాయి చర్చల్లో ఈ దిశగా అడుగులు పడొచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications