సరిహద్దుల్లో కీలక పరిణామం- గోగ్రా హైట్స్ నంచి భారత్, చైనా బలగాలు వెనక్కి..
భారత్, చైనా మధ్య గల్వాన్ ఘర్షణల తర్వాత నెలకొన్న ఉద్రిక్తలు ఏడాది పూర్తయిన తర్వాత తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మిలటరీ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో మరో కీలక ప్రాంతం నుంచి బలగాాల ఉపసంహరణకు మార్గం సుగమమైంది.
తాజాగా భారత్, చైనా మధ్య సాగిన 12వ దఫా కమాండర్ స్దాయి చర్చల తర్వాత కుదిరిన ఒప్పందం మేరకు గోగ్రా హైట్స్ నుంచి ఇరుదేశాలు తమ బలగాల ఉపసంహరణను చేపట్టాయి. గోగ్రా హైట్స్ తో పాటు హాట్ స్పింగ్స్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగాల్సి ఉండగా... ఇందులో గోగ్రా హైట్స్ లో ముందుగా బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలూ అంగీకరించాయి. దీంతో ఇవాళ్టి నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మరలుతున్నాయి.

గోగ్రా హైట్స్ ప్రాంతంలో పాగా వేసిన ఇరుదేశాల బలగాలు గతంలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ఈ తాత్కాలిక నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ఇరుదేశాల అధికారులు తనిఖీలు కూడా చేపడతారు. గతంలో ఇక్కడ ఇరుదేశాల బలగాలు పాగా వేయకముందు ఉన్నట్లుగా ఈ ప్రాంతాన్ని మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు సైనికాధికారులు ప్రకటించారు. ఇరుదేశాల బలగాలు గతంలో గల్వాన్ ఘర్షణల కంటే ముందు ఎక్కడ ఉన్నాయో అక్కడికే తిరిగి వెళ్లిపోతున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications