భారత్ దెబ్బ.. పాకిస్థాన్ అబ్బా.. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయ్..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ అనేక కఠిన ఆంక్షలు విధించింది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, వీసా జారీల నిలిపివేత, ఇరు దేశాల విమానాలకు గగనతలం రద్దు.. వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత్. భారత్ గుండా ఇతర దేశాలకు పాకిస్థాన్ సరుకును అలాగే ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ కు వెళ్లే సరకును కూడా నిలిపివేసింది. భారత్ తన పోర్టుల్లో పాకిస్థాన్ కు చెందిన వస్తువులను తీసుకొచ్చే నౌకలకు అనుమతిని నిలిపివేసింది.

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడితో భారత్- పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. పాకిస్థాన్ పై భారత్ పలు కఠిన ఆంక్షలు విధించింది. వాటిలో కీలకమైనది సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత కాగా మరొకటి భారత భూభాగంలోకి పాకిస్థాన్ వస్తువులను పూర్తిగా నిషేధించడం. అలాగే ఇతర దేశాలకు పాకిస్థాన్ సరుకు తరలించేందుకు భారత్ లోని పోర్టుల గుండా రవాణా జరిగేది. అంతేకాక ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ కు సరుకు రవాణా కూడా భారత్ లోని పోర్టుల నుంచి నిషేధం విధించింది.

India-Pakistan Trade War Pakistan Halts Indian Goods Transit Faces Massive Economic Losses

ఆ విధానాన్ని కూడా భారత్ నిషేధించింది. దీంతో పాకిస్థాన్ కు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. అంతేకాక సరుకు చేరుకునే సమయం గూడా ఎక్కువవుతోంది. దీనివల్ల పాకిస్థాన్ కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని డాన్ పత్రిక వెల్లడించిన కథనం ద్వారా అర్థమవుతోంది.

పాకిస్థాన్ సరుకు భారత్ నుంచి సరఫరా రద్దును మే 2 , 2025 నుంచి పకడ్బందీగా భారత్ అమలు చేసుకుంటూ వస్తోంది. భారత్ పోర్టుల్లోకి పాక్ సరుకును పూర్తిగా నిషేధించింది భారత్. ఈ నిర్ణయం పాకిస్థాన్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బగా మారింది. అక్కడి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భారత్ నిర్ణయంతో పెద్ద నౌకలు పాకిస్థాన్ కు రావడం లేదు. అందువల్ల తమ దిగుమతులకు 30 నుంచి 50 రోజులు ఆలస్యం అవుతోందని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ జావేద్ బిల్వానీ పేర్కొన్నారు.

ఇక 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై దిగుమతుల సుంకాన్ని 200 శాతం వరకు పెంచింది. అప్పటి నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. 2018లో 2.41 బిలియన్ డాలర్లు ఉన్న వాణిజ్యం, 2024 నాటికి 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019లో భారత్‌ కు పాకిస్థాన్ ఎగుమతులు 547.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2024 నాటికి అవి కేవలం 4.8 లక్షల డాలర్లకు పడిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+