ఐక్య రాజ్య సమితి నివేదికలో అన్నీ అవాస్తవాలే: భారత్
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఐక్యరాజ్య సమితి నివేదికను భారత్ తప్పుబట్టింది. నివేదిక వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉందని చెప్పిన భారత్... రిపోర్ట్ వివాదాస్పదంగా ఉందని తెలిపింది. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన రిపోర్టులో అసత్యాలు ఎక్కువగా ఉన్నాయని భారత విదేశాంగా శాఖ పేర్కొంది.
భారత సార్వభౌమత్వం, దేశ సరిహద్దులను విస్మరిస్తే ఐక్యరాజ్య సమితి రిపోర్టును తయారు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాలోని కశ్మీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన యదేచ్ఛగా జరుగుతోందని దీనిపై అంతర్జాతీయ విచారణ జరపాలని యూఎన్ డిమాండ్ చేసింది. అంతేకాదు కశ్మీర్ లో నివసిస్తున్న ప్రజల ఆత్మాభిమానాన్ని భారత్ గౌరవించాలంటూ నివేదికలో పేర్కొంది. జూలై 2016 నుంచి కశ్మీర్‌లో సంభవించిన మరణాలపై విచారణ జరపాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం చీఫ్ జైద్ రాడ్ అల్ హుసేన్ డిమాండ్ చేశారు.

అంతేకాదు ఆందోళనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడటాన్ని జైద్ తప్పుబట్టారు.కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఇలా మొదటిసారి నివేదికను సమర్పించారు. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని జైద్ తన నివేదికలో డిమాండ్ చేశారు. సిరియా లాంటి సంక్షోభం ఉన్న దేశాల్లో మాత్రమే కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ వేస్తారు. అయితే కశ్మీర్ అంశంపై అలాంటి దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి కోరడం శోచనీయం.

ఇదిలా ఉంటే సరైన సమాచారం సేకరించకుండా నివేదికను తయారు చేశారని భారత్ తీవ్రంగా మండిపడింది. జమ్మూ కశ్మీర్ మొత్తం భారత్‌లో భాగమేనని స్పష్టం చేసిన భారత విదేశాంగా శాఖ... పాకిస్తాన్ అక్రమంగా చొరబడి కశ్మీర్‌ను సొంతం చేసుకోవాలనే కుటిల ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తింది.












Click it and Unblock the Notifications