PM Modi:మాకు తెలిసింది మానవత్వం..ప్రజాస్వామ్యం మా డీఎన్ఏ..!!
యుద్దానికి, ఘర్షణలకు ఇది సమయం కాదన్నారు ప్రధాని మోదీ. గయానా పార్లమెంటులో ప్రసంగించిన ఆయన ప్రపంచ శాంతికోసం ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీలంక, లేదా మాల్దీవ్స్ ఇలా ఏ దేశం సంక్షోభంలో కూరుకుపోయినా భారత్ ఆ దేశాలకు అండగా నిలిచిందని, ఎప్పుడూ కూడా స్వార్థం కోసం చూడలేదని మోదీ చెప్పారు.
"నేపాల్ నుంచి టర్కీ, సిరియా వరకు ఏ దేశంలో భూకంపాలు సంభవించినా.. ఆ దేశాలకు సహాయం చేయడంలో లేదా స్పందించిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది.సహాయం చేసే గుణం భారత సంప్రదాయం.విస్తరణ వాదాన్ని భారత్ ఎప్పుడూ విశ్వసించదు.అంతరిక్షం,సముద్రం అనే రెండు అంశాలపై అన్ని దేశాల సహకారం ఉండాలి తప్ప ఈ రెండు అంశాల కోసం ఘర్షణ, యుద్ధాలు తగదు. ఈ యుగం యుద్ధాల యుగం కాదు" అని ప్రధాని మోదీ అన్నారు.గయానా దేశ అత్యున్నత పురస్కారం "ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్"తో ఆదేశ ప్రభుత్వం గౌరవించిన అనంతరం మోదీ పార్లమెంటులో మాట్లాడారు.

ప్రపంచ దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు వీలైతే సహాయం చేయడం ఆదేశ ప్రజలకు అండగా ఉండటం అందుకు తగ్గ నిర్ణయాలను మానవీయ కోణంలో తీసుకుంటామని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యం - మానవీయత ముందు అనే నినాదంతో భారత్ ముందుకెళుతోందని విశ్వబంధులా డ్యూటీ చేసుకెళుతోందని మోదీ చెప్పారు. సమ్మిళిత వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే అది ప్రజాస్వామ్యం మార్గం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్న ప్రధాని మోదీ... భారత్ గయానా దేశాల్లో ప్రజస్వామ్యం అనేది డీఎన్‌ఎలో ఉందని, ముందుచూపు, క్రమణశిక్షణగల దేశాలు భారత్ గయానా అని ఆయన కొనియాడారు.
భారత్ - గయానా బంధం పై...

భారత్, గయానా రెండు దేశాలు ఒకటే అని చెప్పిన మోదీ ఈ రెండు దేశాలు బానిసత్వం, కష్టాలు అనుభవించాయని గుర్తుచేశారు.దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఇరు దేశాలకు చెందిన గొప్ప వారు ప్రాణత్యాగం చేశారని చెప్పారు.ఈ రోజు రెండు దేశ ప్రజాస్వామ్యాలు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు.అందుకే గయానా పార్లమెంట్ వేదికగా ఈ దేశానికి 140 కోట్ల భారతీయుల తరుపున శుభాకాంక్షలు తెలపండంతో పాటు అభినందనలు మోదీ తెలిపారు. ద్వీప దేశాలు చిన్న దేశాలు కాదని అవి మహాసముద్రాలు కలిగిన దేశాలుగా ప్రధాని మోదీ అభివర్ణించారు.












Click it and Unblock the Notifications