శ్రీలంకతో భారత్ తొలి రక్షణ ఒప్పందం-చైనాకు చెక్ పెట్టిన మోడీ..!
శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భారత్ తరఫున ఆ దేశానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తన టూర్ లో భాగంగా శ్రీలంక ప్రధాని అనుర కుమార దిసనాయకేతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రధాని మోడీ.. తద్వారా పొరుగుదేశం చైనా దూకుడుకు చెక్ పెట్టారు. ఈ మధ్య కాలంలో చైనా వైపు మొగ్గుతున్న శ్రీలంకకు కూడా అడ్డుకట్ట వేయగలిగారు.
శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు దిశనాయకేతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. గార్డ్ ఆఫ్ హానర్ తో శ్రీలంక అధికారులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. శ్రీలంకతో కచ్చదీవుల విషయంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ఇరుదేశాల జైళ్లలో ఉన్న మత్సకారుల్ని విడుదల చేయాలని ఇరువురు ప్రధానులు నిర్ణయించారు. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతేడాది సంక్షోభాల తర్వాత శ్రీలంక కోలుకుంటుండటంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కోవిడ్, తీవ్రవాద దాడుల సమయంలో శ్రీలంకకు అండగా నిలిచామని, భవిష్యత్తులోనూ ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీలంకతో తొలి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో పాటు డిజిటల్, ధర్మల్ సహా ఇతర రంగాల్లో ఆరు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరోవైపు యూఏఈతో కలిసి శ్రీలంకలో ఇంధన కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోడీ మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీలంక తూర్పున ఉన్న ఒక సహజ నౌకాశ్రయం అయిన ట్రింకోమలీలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన జిల్లాలోని ఈ కేంద్రం బహుళ-ఉత్పత్తి పైప్‌లైన్ నిర్మాణాన్ని కలిగి ఉంటుందని విదేశాంగశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications