వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను అంత సులువుగా చావను : విద్యుత్ షాక్‌గురైన పాక్ మంత్రి

|
Google Oneindia TeluguNews

భారత దేశం తనను చనిపోవాయలని కోరుకుందని అయితే భారత్ ఆశించినట్టుగా తాను అంత ఈజీగా చనిపోనని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ ‌వ్యాఖ్యానించారు. శుక్రవారం పాకిస్థాన్ ప్రభుత్వం కశ్మీరీలకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంధర్భంలో ఆయనకు విద్యుత్ షాక్ తలగడంతో ఆ వీడీయో సోషల్ మీడీయాలో సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే..దీంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

12 సంవత్సరాల్లోనే గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానం12 సంవత్సరాల్లోనే గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానం

భారత దేశంపై యుద్దం తప్పదని, అదికూడ ఆక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగుతుందని ప్రకటించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ ‌కు మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కాడు. కశ్మీర్ అంశంపై ఎప్పటికప్పుడు ఉత్కంఠవాతవరణం రేపుతున్న పాక్ మంత్రికి గత శుక్రవారం విద్యుత్ షాక్ కొట్టింది. ప్రతి శుక్రవారం కశ్మీరీలకు మద్దతుగా కశ్మీర్ అవర్ పేరుతో సంఘీభావం తెలుపాలన్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపుతో గత శుక్రవారం రైల్వే మంత్రి షేక్ రశీద్ పాకిస్థాన్‌‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గోన్నారు.

India wants me to die. Let India know that I wont die that easy:Sheikh Rashid

కశ్మీర్ అవర్‌లో పాల్గోన్న మంత్రి భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన మంత్రి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. దీంతో ఒక్కసారిగా ఓయ్ తనకు విద్యుత్ షాక్ తగిలింది. అయినా పర్వాలేదు. పవర్ తిరిగి వచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడీయో భారత్‌ సోషల్ మీడీయాలో వైరల్ కావడంతో మీడీయాలో సైతం అనేక కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే భారత మీడీయా ప్రచురించిన కథనాలపై స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

English summary
"India wants me to die. Let India know that I won't die that easy."a day after Pakistan Railway Minister Sheikh Rashid's shrieks on getting an electric shock went viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X