యుఎస్ లో భారత్ మహిళకు 14 ఏళ్లు జైలు శిక్ష

మిల్పోర్డ్: పసిబాలుడు చనిపోవడానికి కారణం అయిన ఓ భారతీయ యువతికి అమెరికాలో 14 సంవత్సరాలు జైలు శిక్షపడింది. న్యాయస్థానం తీర్పు వెల్లడించిన తరువాత ఆమెను జైలుకు తరలించామని అమెరికా పోలీసు అధికారులు తెలిపారు.

భారత్ కు చెందిన కింజాల్ పటేల్ (29) అనే యువతికి జైలు శిక్షపడింది. కెనెక్టిట్ ప్రాంతంలో కింజాల్ పటేల్ ఉంటున్నది. ఆమె చిన్న పిల్లల సంరక్షకురాలిగా పని చేస్తున్నది. ఈమె పెంపకంలో అతియాన్ శివకుమార్ (19 నెలలు) అనే బాలుడు ఉన్నాడు.

2014 జనవరి నెలలో అతియాన్ శివకుమార్ అల్లరి చేశాడు. చెప్పిన మాట వినలేదు. తరువాత కింజాల్ పటేల్ కు చిరాకు తెప్పించడంతో ఆమె బాలుడిని గట్టిగా నెట్టింది. అతియాన్ శివకుమార్ కిందపడటంతో తలకు తీవ్రగాయాలైనాయి.

Indian Babysitter Gets 14 Years in America

యలె-న్యూ హెవెన్ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పోందిన అతియాన్ శివకుమార్ చివరికి మరణించాడు. బాలుడు కాలు జారీ ఫ్లోర్ మీద పడటంతో తలకు తీవ్రగాయం అయ్యిందని కింజాల్ పటేల్ మొదట పోలీసులకు చెప్పింది.

అయితే పోస్టుమార్టుం నివేదికలో అసలు విషయం వెలుగు చూసింది. అమెరికా ఫెడరల్ కోర్టు ముందు నిలబడిన కింజాల్ పటేల్ జడ్జితో ఒక్క మాటకూడ మాట్లాడలేదు. ఆమె నేరం చేసినట్లు రుజువు కావడంతో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+