న్యూజిలాండ్‌లో మైనర్‌పై భారత సంతతి వ్యక్తి అఘాయిత్యం..!
న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడడం తీవ్ర సంచలనంగా మారింది. మైనర్‌పై అత్యాచారం కేసులో ఏడేళ్లకు పైగా జైలు శిక్ష విధించారు. 2023లో ఈ ఘటన జరగగా ఇప్పుడు న్యాయస్థానం తీర్పు విధించింది. గత 11 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న సింగ్ చేసిన నేరం కోర్టులో నిర్ధారించబడటంతో ఈ కఠిన తీర్పు వెలువడింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఘటన ఎలా జరిగింది?
2023లో ఒక మైనర్ తన ఇంటికి చేరడానికి క్యాబ్‌ను బుక్ చేసుకుంది. సత్వీందర్ సింగ్ ఆమెను పికప్ చేసిన తర్వాత కారులోని జీపీఎస్ వ్యవస్థను నిలిపివేసి.. అసలు మార్గం కాకుండా మరో రూట్‌లోకి మళ్లించాడు. అదే గమనంలో మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. దాడి అనంతరం బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి వద్ద దించాలని సింగ్ వదిలిపెట్టాడు. ఆ సమయంలో షాక్‌లో ఉన్న ఆ బాలిక సహాయం కోసం వేడుకొని పోలీసులకు సమాచారమిచ్చింది.

పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్యాబ్ రూట్, బాధితురాలి వాంగ్మూలం.. సమీపంలోని సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ లైట్ కెమెరా రికార్డింగ్స్, క్యాబ్‌లోని ఇంటీరియర్ కెమెరా స్నిపెట్లు, అన్నీ సాక్ష్యాలుగా ఉపయోగించి సత్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అతను ఆరోపణలను ఖండించినప్పటికీ.. సేకరించిన ఆధారాలు అతని వాదనలను పూర్తిగా తిప్పికొట్టాయి.
కోర్టు తీర్పు..
విచారణను పూర్తిచేసిన న్యూజిలాండ్ కోర్టు, నేరం నిర్ధారణ కావడంతో సత్వీందర్ సింగ్‌కు ఏడేళ్లకు పైగా కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్‌పై నేరం జరపడం, నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం, ఆమె భద్రతను ప్రమాదంలోకి నెట్టడం వంటి అంశాలను కోర్టు తీవ్రమైన నేరాలుగా పరిగణించింది. తీర్పు సమయంలో జడ్జి మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని, టాక్సీ డ్రైవర్‌గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉన్నప్పుడు దుర్వినియోగం చేసుకున్నాడని వ్యాఖ్యానించింది. మైనర్‌పై చేసిన నేరం సమాజాన్ని దిగజార్చేదని తీర్పు వెల్లడించింది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌లో క్యాబ్ సేవల భద్రతపై కొత్త చర్చ మొదలైంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన పాలసీలను మరింత బలోపేతం చేయాలని పలు మహిళా మరియు చిన్నారుల రక్షణ సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అదే సమయంలో విదేశాల్లో నివసిస్తున్న భారత కమ్యూనిటీలో కూడా ఈ ఘటన తీవ్ర నిరాశను కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో న్యూజిలాండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం, జీపీఎస్‌ను ఆఫ్ చేసే డ్రైవర్లపై కఠిన చర్యలు.. మైనర్ ప్రయాణికుల కోసం ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు, క్యాబ్ లోపలి కెమెరా రికార్డింగ్స్ తప్పనిసరి చేయడం లాంటివి పరిశీలిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications