వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతి ఐఎస్ రిక్రూటర్ అబు ఖలీద్ హతం

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్‌: ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ రిక్రూటర్‌‌‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన నీల్‌ ప్రకాశ్‌ సిరియాలో హతమైనట్లు ఆస్ట్రేలియా మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ సెక్యూర్‌ కమ్యూనికేషన్‌ యాప్‌ టెలిగ్రామ్‌ ద్వారా ప్రకాశ్‌ మరణవార్త బయటకొచ్చింది.

మరోవైపు ఐఎస్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రకాశ్‌ అలియాస్‌ అబు ఖలీద్‌ అల్‌ కాంబోడి మరణించినట్లు ఐఎస్‌ ప్రకటించింది. అయితే ప్రకాశ్‌ ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడన్న దానిపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. మరోవైపు అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Indian-origin Fijian Islamic State recruiter killed in Syria: Reports

మెల్బోర్న్‌కు చెందిన ప్రకాశ్‌కి ఐఎస్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. కాగా, 2013లో ప్రకాశ్‌ సిరియాకు పారిపోయాడు. అనంతరం అక్కడ పేరు మార్చుకుని.. ఐఎస్‌లో సభ్యులను తీసుకునేందుకు రిక్రూట్‌మెంట్‌ బాధ్యతలు చేపట్టాడు.

మొదట సోషల్‌మీడియా ద్వారా ఐఎస్‌ నియామకాలు చేపట్టేవాడు. అయితే భద్రత దృష్ట్యా ప్రకాశ్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిని మార్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిరుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకాశ్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఒకవేళ అబు ఖలీద్ మృతి చెందినట్లయితే ఐఎస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు దాడులకు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

English summary
An Indian-origin Fijian who is Australia's most wanted Islamic State terror recruiter has reportedly been killed in Syria, according to media reports today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X