తల్లినీ దోచాడు: ప్రవాస భారతీయుడికి ఆరేళ్ల జైలు
సిడ్నీ: వరుస మోసాలకు పాల్పడుతున్న ప్రవాస భారతీయుడికి న్యూజిలాండ్ న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. 33 ఏళ్ల సంజయ్ కుమార్ జోషి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది.
అంతేకాదు, కన్నతల్లితో పాటు ఇరవై మందిని అతను మోసం చేశాడని కోర్టు నిర్ధారించింది. సుమారు రూ.13 కోట్లు కాజేశాడు. అక్లాండ్ విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్, అకౌంటింగ్ చదివిన సంజయ్ ఫోర్జరీ పత్రాలతో ఫైనాన్స్ తీసుకొని ఎగ్గొట్టాడు.

తన వ్యాపార భాగస్వామి ఆరోన్ యంగ్‌కు మిలియన్ డాలర్లు ఎగనామం పెట్టాడు. తన తల్లి క్రెడిట్ కార్డును ఉపయోగించి తొమ్మిది వేల డాలర్లకు పైగా ఖర్చు చేశాడు.
'కన్నతల్లిని కూడా దోచుకున్నావ్' అని సంజయ్‌తో న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సంజయ్ ఉద్దేశ్యపూర్వకంగానే మోసానికి పాల్పడ్డాడని, స్వప్రయోజనాల కోసం ఇతరులను వంచించాడని జడ్జి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications