వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఘనత: యూఎస్ జిబిసి సిఈఓగా రామానుజం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ ప్రతిభ చాటుతున్నారు. అమెరికాలోని అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంద్రా నూయి, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారి సరసన తాజాగా మరో పేరు కూడా చేరింది.

మనదేశానికి చెందిన ఆయనే మహేశ్ రామానుజం. ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(యూఎస్ జీబీసీ) సీఈవోగా ఆయన ఎంపికయ్యారు. పర్యావరణ హిత భవనాల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణకు యూఎస్ జీబీసీ సూచనలు, సలహాలు అందిస్తోంది.

 Indian-origin Mahesh Ramanujam named CEO of US Green Building

ప్రస్తుత యూఎస్ జీబీసీ సీఈవో రిక్ ఫెడ్రిజీ స్థానంలో రామానుజమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 చివరల్లో రిక్ ఫెడ్రిజీ తప్పుకోనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై చెందిన మహేశ్ రామానుజం విశేష ప్రతిభతో అగ్రస్థాయికి ఎదిగారు.

సీఓఓ, గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ప్రెసిడెంట్‌గా ఆయన మెరుగైన పనితీరు కనబరచారని యూఎస్ జీబీసీ బోర్డ్ అధిపతి మార్గె ఆండర్సన్ తెలిపారు. విస్తృతమైన పరిజ్ఞానంతో రామానుజం ఇప్పటికే తన నాయకత్వ లక్షణాలను రుజువు చేసుకున్నారని కొనియాడారు.

రామానుజం లీడర్ షిప్‌ను గౌరవిస్తామని, పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు యూఎస్ జీబీసీ బోర్డ్‌కు రామానుజం ధన్యవాదాలు తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ సంస్థకు సేవలు అందిస్తానని రామానుజం పేర్కొన్నారు.

English summary
Indian-origin Mahesh Ramanujam has been named the new CEO of the prestigious US Green Building Council (USGBC), a non-profit organisation that promotes sustainability in how buildings are designed, built, and operated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X