ఐఎస్ ఉగ్రవాది అంటూ నోట్లో కాల్చాడు, లూటీ
కాలిఫోర్నియా: అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే అతను ప్రాణాలతో భయటపడి చికిత్స పొందుతున్నాడని అమెరికా పోలీసు అధికారులు చెప్పారు. భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగుడి కోసం మిచిగాన్ పోలీసులు గాలిస్తున్నారు.
మిచిగాన్ లో భారత సంతతికి చెందిన ఇందర్ జీత్ సింగ్ (సిక్ అమెరికన్) ఓ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఈ స్టోర్ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి (పేరు వెల్లడించలేదు) క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
వారం క్రితం ఇందర్ జీత్ సింగ్ కుమార్తె గుర్లీన్ కౌర్, క్లర్క్ స్టోర్ లో ఉన్నారు. అదే సమయంలో ముసుగు వేసుకుని తుపాకి పట్టుకుని వెళ్లిన దుండగుడు క్లర్ ను లాక్కోని స్టోర్ లో నుంచి అక్కడే ఉన్న వెనుక గదిలోకి లాక్కోని వెళ్లాడు.

నగదు ఇవ్వాలని దుండగుడు డిమాండ్ చేశాడు. నగదు ఇవ్వడానికి నిరాకరించిన క్లర్క్ దుండగుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో నీవు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాది అంటూ క్లర్క్ నోట్లో తుపాకి పెట్టి కాల్చివేశాడు.
బుల్లెట్ లు దవడలో నుంచి బయటకు దూసుకు వెళ్లాయి. తరువాత దుండగుడు స్టోర్ లో నగదు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనాడని గుర్లీన్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లర్క్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
సరైన సమయంలో క్లర్క్ ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో భయటపడ్డాడని పోలీసులు చెప్పారు. సిక్కులు గడ్డం ఎక్కువ పెంచుకోవడంతో కొందరులు దుండగులు వారిని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications