వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీరకట్టుతో అమెరికన్ గా ప్రమాణం చేసిన ఇండియన్ టెకీ సుధా నారాయణన్ .. వైట్ హౌస్ లో.. ట్రంప్ సమక్షంలో

|
Google Oneindia TeluguNews

వైట్ హౌస్ వద్ద ఇంతకు ముందు ఎన్నడూ జరగని అరుదైన ఘటన చోటు చీసుకుంది. అమెరికా శ్వేతా సౌధం ఓ ఇండియన్ టెకీ అమెరికా పౌరసత్వం తీసుకుని అమెరికా దేశాస్తురాలిగా ప్రమాణం చెయ్యటానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహించారు. భారతదేశానికి చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్‌తో సహా ఐదుగురు ఇతర దేశాల నుండి అమెరికాలో ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్ అమెరికన్ పౌరులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారిని స్వాగతించారు..

సాగర పోరుకు సై అంటున్న ఇండియా .. దీవులలో సన్నాహాలు .. చైనాకు దీటుగాసాగర పోరుకు సై అంటున్న ఇండియా .. దీవులలో సన్నాహాలు .. చైనాకు దీటుగా

వైట్ హౌస్ లో అమెరికన్లుగా ఐదుగురి ప్రమాణ స్వీకారం

వైట్ హౌస్ లో అమెరికన్లుగా ఐదుగురి ప్రమాణ స్వీకారం

వైట్ హౌస్ వద్ద నాచురలైజేషన్ వేడుకకు ట్రంప్ ఆతిథ్యం వహించారు. వైట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశం, బొలీవియా, లెబనాన్, సుడాన్ మరియు ఘనా, ఐదు దేశాల ఇమ్మిగ్రెంట్లు కూడా అమెరికా పౌరులుగా మారారు . వారి కుడి చేయి పైకెత్తి, ఎడమ చేతిలో యుఎస్ జెండా పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు . యునైటెడ్ స్టేట్స్ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి చాడ్ వోల్ఫ్ వారితో అమెరికా పౌరులుగా ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలను ట్రంప్ అక్కడే ఉండి చూశారు .

అమెరికన్ గా ప్రమాణం చేసిన భారతదేశానికి చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్

అమెరికన్ గా ప్రమాణం చేసిన భారతదేశానికి చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్

అమెరికా పౌరులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో భారతదేశానికి చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కూడా ఉన్నారు. ట్రంప్ వీరందరికీ ఘనంగా స్వాగతం పలికారు. మా గొప్ప అమెరికన్ కుటుంబంలోకి ఐదుగురు కొత్త సభ్యులను మేము స్వాగతిస్తున్నందున ఈ రోజు అమెరికా ఆనందిస్తుంది అని పేర్కొన్నారు . మీరు ఇప్పుడు దైవ భూమిపై ఉన్న గొప్ప దేశపు పౌరులు మీకు అభినందనలు" అని ట్రంప్ పేర్కొన్నారు .

అమెరికన్ పౌరసత్వం పై గొప్పగా చెప్పిన ట్రంప్

అమెరికన్ పౌరసత్వం పై గొప్పగా చెప్పిన ట్రంప్

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన అమెరికన్ పౌరులు నిబంధనలను పాటించారు, చట్టాలను గౌరవించారు, దేశ చరిత్రను నేర్చుకున్నారు, అమెరికన్ విలువలను స్వీకరించారు మరియు తమను తాము అత్యున్నత చిత్తశుద్ధి గల వారిగా నిరూపించుకున్నారని ట్రంప్ అన్నారు. అయితే ఇది అంత సులభం కాదని అయినప్పటికీ వారంతా సాధించారని అన్నారు . మీరు ఈ రోజు మాతో ఇక్కడ ఉన్నందుకు మేము అభినందిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు . మీరు ప్రపంచంలోనే ఎంతో విలువైన,అమూల్యమైన ఆస్తిని సంపాదించారని ,దానిని అమెరికన్ పౌరసత్వం అని పిలుస్తారని ఆయన పేర్కొన్నారు.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి
చీరకట్టుతో అమెరికన్ సిటిజన్ గా మారిన ఇండియన్ టెకీ

చీరకట్టుతో అమెరికన్ సిటిజన్ గా మారిన ఇండియన్ టెకీ


తరువాత, ట్రంప్ ఐదుగురు కొత్త పౌరుల పేర్లతో పాటు వారి నేపధ్యాన్ని గురించి మాట్లాడారు. 13 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చిన భారతదేశంలో జన్మించిన సుధా సుందరి నారాయణన్ ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని కొనియాడారు. అద్భుత ప్రతిభ ఉన్న ఆమెను, ఆమె భర్తను ట్రంప్ కొనియాడారు . వారి పిల్లలను బ్యూటిఫుల్ ఆపిల్స్ ఆఫ్ దైర్ లైఫ్ గా ట్రంప్ అభివర్ణించారు. పింక్ చీర ధరించి భారత సాంప్రదాయంలో అమెరికా పౌరసత్వం తీసుకున్న నారాయణన్ కు సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్ షిప్ ట్రంప్ అందజేశారు.

English summary
President Donald Trump has presided over a rare naturalisation ceremony at the White House where five immigrants, including a software developer from India, were sworn in as American citizens, as the US leader welcomed them to the "magnificent nation" that is comprised of every race, religion and colour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X