• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేసియా: ఆటగాళ్ల ‘చేతుల్లోనే ప్రాణాలు విడిచిన’ అభిమానులు.. స్టేడియం తొక్కిసలాట మృతుల్లో 32 మంది చిన్నారులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇండోనేసియాలోని కంజూరుహా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో క్రీడాకారుల చేతుల్లోనే కొంత మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

ఇండోనేసియాలోని కంజూరుహా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో క్రీడాకారుల చేతుల్లోనే కొంత మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 32 మంది చిన్నారులు మరణించినట్లు హోమ్ టీమ్ కోచ్ జేవియర్ రోకా తెలిపారు.

జావాలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 125 మంది ప్రాణాలను కోల్పోవడం తనను మానసికంగా కుదిపేసిందని జేవియర్ రోకా చెప్పారు.

శనివారం జరిగిన ఈ విషాదంలో మరణించిన అతి చిన్న వయసు వారిలో మూడేళ్ళ చిన్నారి ఉన్నారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే పిచ్ ను ఆక్రమించిన అభిమానులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంపై 18 మంది అధికారులను విచారిస్తున్నారు.

మలాంగ్ పోలీస్ చీఫ్ ను విధుల నుంచి తొలగించారు. మరో 9 మంది అధికారులను సస్పెండ్ చేశారు.

పోలీసులు గ్యాస్ ప్రయోగించడంతో ఊపిరి అందక 320 మందికి పైగా అభిమానులు ఈ తొక్కిసలాటలో గాయాల పాలయ్యారు.

ఈ ఘటనలో 3 - 17 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారని మహిళా శిశు వ్యవహారాల డిప్యూటీ మంత్రి చెప్పారు.

"ఫుట్ బాల్ జట్ల అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆగకుండా అనేక పర్యాయాలు గ్యాస్ ప్రయోగించారని ఒక ప్రత్యక్ష సాక్షి బీబీసీకి చెప్పారు. హోమ్ టీం అరేమా ఎఫ్ సి జట్టు పెర్సెబాయా సురాబయా జట్టు చేతిలో ఓడిపోవడంతో అరేమా జట్టు అభిమానులు పిచ్ పైకి పరుగుపెట్టారు.

సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలో ఈ తొక్కిసలాట నుంచి బయటపడేందుకు అభిమానులు కంచెలను ఎక్కే ప్రయత్నం చేయడం కనిపించింది. మరొక వీడియోలో నేల మీద పడి ఉన్న మృతదేహాలు కూడా కనిపించాయి.

https://www.youtube.com/watch?v=77Qv9Y7aqUY

"స్టేడియం లోపల ఒకేసారి చుట్టుముట్టిన పొగ సందర్శకుల్లో ఆందోళనను కలిగించింది" అని చంద్ర అనే సాక్షి చెప్పారు.

"చిన్న పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు, మహిళలు కళ్ళు తిరిగి పడిపోయారు, ఎటు చూసినా అరుపులు, అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన వారి దృశ్యాలతో నిండిపోయింది" అని చెప్పారు.

అందరూ ఒకేసారి బయటపడేందుకు ప్రయత్నించడంతో స్టేడియం స్టాండ్స్ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లలేకపోయినట్లు మరొక అభిమాని చెప్పారు.

"నేను స్నేహితులతో కలిసి స్టాండ్స్ పైకి వెళ్లాను. పొగ పీల్చకుండా స్కార్ఫ్ చుట్టుకున్నాను. అక్కడి నుంచి పక్కనే ఉన్న మైదానంలోకి దూకి అక్కడి నుంచి బయటకు వెళ్లాను" అని చెప్పారు.

తన 17 ఏళ్ల కూతురికి తీవ్రంగా గాయాలైనట్లు ఎస్తర్ అండాయనెంగ్త్యాస్ చెప్పారు. తన కూతురు మెడ విరిగి మెదడులో వాపు ఏర్పడిందని తెలిపారు.

"ఆ రోజు ఆ గేమ్ చూసేందుకు వెళ్లవద్దని చెప్పాను. కానీ, గేమ్ కోసం వెళ్లిన రోజు తను తిరిగి ఇంటికి రాలేదు. మేము అన్ని చోట్లా వెతికితే, పోలీసులు మార్చురీ లో చూడమని చెప్పారు. మా అమ్మాయి తనతో పాటు ఐడీ తీసుకుని వెళ్లకపోవడంతో తనను గుర్తించడం కష్టమయింది" అని చెప్పారు.

ఆ ప్రదేశమంతా "నా బిడ్డ ఎక్కడ" అని అరుస్తున్న తల్లితండ్రుల ఆర్తనాదాలు మారుమోగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో తల్లితండ్రులు స్పృహ తప్పి పడిపోవడాన్ని కూడా చూసినట్లు మరి కొంత మంది చెప్పారు.

"ఒక మహిళ తన బిడ్డను హత్తుకుంటూ స్పృహ తప్పి పడిపోయారు. ఆ వెంటనే ఆ చిన్నారి కళ్ళు తిరిగి పడిపోయారు. తర్వాత కొంత మంది అభిమానులు వారిని స్పృహ లేని స్థితిలోనే స్టేడియం నుంచి బయటకు తీసుకుని వెళ్లారు" అని చెప్పారు. టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల వారు స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చు" అని అన్నారు.

ఎగ్జిట్ పక్కనే కనిపిస్తున్న పగిలిన కిటికీ

"మ్యాచ్ ముగిసిన వెంటనే అరేమా అభిమానులు అవతలి జట్టు వారి పై చేయి చేసుకునేందుకు పిచ్ వైపు పరుగుపెట్టడంతో పోలీసులు వెంటనే దాడిని ఆపేందుకు జోక్యం చేసుకున్నారు" అని 21 ఏళ్ల ముహమద్ దీపో మౌలానా చెప్పారు.

దీంతో, మరింత మంది అభిమానులు వారికి మద్దతు ఇచ్చేందుకు పిచ్ వైపు పరుగులు తీశారని చెప్పారు.

"కుక్కలు, కవచాలతో పోలీసులు, సైనికులు రంగంలోకి దిగారు. స్టేడియంలో సందర్శకుల వైపు 20 రౌండ్లకు పైగా టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఆయుధాలను ప్రయోగించిన అధికారులు దీనికి బాధ్యులని వారిని అంతర్గత వ్యవహారాల బృందం విచారిస్తోందని పోలీసు ప్రతినిధి దేదీ ప్రసేత్యో చెప్పారు.

ఈ ప్రాంతపు పోలీస్చీఫ్ ను కూడా విధుల నుంచి తొలగించారు.

ఈ ఘటనకు సంబంధించి ఫీల్డ్ సెక్యూరిటీ బృందం, ఇండోనేసియా ఫుట్ బాల్ లీగ్ బృందం లోని అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటన పై ఇండోనేసియా మానవ హక్కుల కమిషన్ కూడా విచారణ జరుపుతుందని తెలిపింది. అధికారిక విచారణ పూర్తయ్యేవరకు ఇండోనేసియా టాప్ లీగ్ లో జరిగే అన్ని మ్యాచ్ లను రద్దు చేయమని అధ్యక్షుడు జోకో విడోడో ఆదేశించారు.

పోలీసులు నిరాయుధుల పై అధికార దుర్వినియోగం చేశారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. పోలీసుల అరాచకాలను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం రాత్రి ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

కిక్కిరిసిన స్టేడియంలలో ఇండోనేసియా పోలీసులు తరచుగా టియర్ గ్యాస్ ప్రయోగించడం పై గతంలో కూడా అనేక విమర్శలెదుర్కొన్నారు.

"గుంపులను అదుపు చేసేందుకు పోలీసులు పరిమితికి మించి ప్రవర్తించారు" అని అరేమా ఎఫ్ సి కోచ్ రోకా స్పెయిన్ బ్రాడ్ కాస్టర్ కాడెనా సెర్ కు చెప్పారు.

ధ్వంసమైన పోలీసు వాహనాలు

ఈ ఘటనను "ఫుట్ బాల్ ప్రపంచానికి ఇదొక చీకటి రోజు. ఇది ఊహకు మించిన విషాదం" అని ఫిఫా పేర్కొన్న తర్వాత విచారణకు ఆదేశించారు.

మ్యాచ్ లు జరుగుతున్న ప్రదేశాల్లో గుంపులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ వాడకూడదని ఫిఫా నిబంధనలు చెబుతున్నాయి.

ఈ ఘటన పై నివేదికను సమర్పించమని ఫిఫా ఇండోనేసియా ఫుట్ బాల ఫెడరేషన్‌ను కోరింది.

ఈ స్టేడియం సామర్ధ్యం 38,000 కాగా 42,000 టికెట్లను అమ్మినట్లు ఇండోనేసియా రక్షణ మంత్రి మహ్ఫుల్ మహ్ ఫుద్ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

"పరిస్థితి అరాచకంగా మారిపోయింది. వాళ్ళు అధికారుల పై దాడికి దిగి, కార్లను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు" అని తూర్పు జావా పోలీస్ అధికారి నికో అఫింటా అన్నారు. మరణించిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.

"అయితే, అభిమానులందరూ అరాచకంగా ప్రవర్తించలేదు. సుమారు 3000 మంది పిచ్ పైకి ప్రవేశించారు" అని చెప్పారు.

"అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించిన అభిమానులందరూ ఒకే ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు పరుగులు తీశారు. దీంతో, అందరూ ఒకే చోట గుమిగూడిపోయారు. దీంతో, ఆక్సిజన్ అందక ఊపిరి అందక చనిపోయారు" అని పోలీస్ అధికారి చెప్పారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలో ఉన్న అభిమానులు పిచ్ వైపు పరుగులు తీశారు. విఐపీ స్టాండ్ లో ఉన్న పోలీసులు పిచ్ మధ్యలోకి, 10 - 14 స్టాండ్స్ వైపు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలో ఉన్న అభిమానులు పిచ్ వైపు పరుగులు తీశారు. కానీ, 12 - 14 స్టాండ్స్ మధ్య ఎక్కువ మంది గుమిగూడి ఇరుక్కుపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Indonesia: Fans who 'left their lives in the hands' of the players... 32 children among the dead in the stadium stampede
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X