కూలిన విమానంలో మిలియన్ డాలర్ల డబ్బు

జకార్తా: ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాల్లో ఆదివారం కుప్పకూలిన విమానంలో సుమారు 4లక్షల డెభ్భై వేల డాలర్ల డబ్బు ఉన్నట్లు సోమవారం పోస్ట్‌ ఆఫీస్‌ అధికార ప్రతినిధి అబు సోఫ్జాన్‌ వెల్లడించారు.

సిబ్బంది సహా 54 మంది ప్రయాణికులతో కూలిపోయిన త్రిగణ ఏటీఆర్‌ 42-300 విమానం శకలాల వద్దకు చేరుకోవడానికి సహాయ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విమానంలో నలుగురు ప్రయాణికులు 6.5 బిలియన్ల ఇండోనేషియా రూపాయలు(4.70 లక్షల అమెరికా డాలర్లు) తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Indonesian plane that crashed was carrying almost half a million dollars

పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పేదలకు డబ్బు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నారని అబు సోఫ్జాన్‌ తెలిపారు. బింటాంగ్‌ పర్వత ప్రాంతంలోని అడవుల్లో సహాయక విమానం శిథిలాలు గుర్తించిందని.. అవి త్రిగణ విమాన శకలాలేనా అనే అంశం గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

గాలింపు బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విమానంలో ప్రయాణికులంతా ఇండోనేషియాకు చెందిన వారేనని చెప్పారు. ప్రయాణీకుల్లో 44 మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+