ప్రాణ భయం మధ్య ఇరాన్ నేతల సంచలన నిర్ణయం..అక్కడ విమానం వదిలి..!!

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఉత్కంఠభరితమైన ఉదంతం చోటుచేసుకుంది.ఇరాన్ అగ్రనాయకత్వం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి విమానాన్ని వదిలిపెట్టి,రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి రావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ రాజకీయ యవనికపై నరాలు తెగే ఉత్కంఠ.అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఊహించని పరిణామం ఎదురైంది.తమ విమానంపై దాడి జరిగే అవకాశం ఉందన్న పక్కా సమాచారంతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాకర్ కాలిబాఫ్ తమ తిరుగు ప్రయాణాన్ని అత్యంత రహస్యంగా మార్చేశారు.

iran-leaders-avoid-flying-due-to-attack-threats-after-failed-us-talks-in-pakistan-opting-for-secret

విమానం వద్దు.. ప్రాణమే ముద్దు

ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. ముఖ్యంగా అణు కార్యక్రమాలను తగ్గించుకోవాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఈ ఉద్రిక్తతల మధ్య, తిరుగు ప్రయాణంలో తమ విమానాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందన్న "నేరుగా హెచ్చరికలు" రావడంతో ఇరాన్ బృందం అప్రమత్తమైంది.

ముందుగా అనుకున్న విమానాన్ని కాకుండా,అత్యంత గోప్యంగా మరో విమానంలో మషద్ నగరంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుండి గాలిలో ప్రయాణించడం క్షేమం కాదని భావించి.. సామాన్యులలాగా బస్సులు, రైళ్లలో ప్రయాణించి టెహ్రాన్ చేరుకున్నారు.

అమెరికాపై పెరుగుతున్న అపనమ్మకం

ఇరాన్ రాజకీయ విశ్లేషకుడు మహమ్మద్ మరండి ప్రకారం.. ఈ పరిణామం అమెరికాపై ఇరాన్‌కు ఉన్న తీవ్రమైన అపనమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. చర్చల పేరుతో పిలిచి తమ నాయకత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఇరాన్ అనుమానిస్తోంది. మరోవైపు, చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ.. రాబోయే కొద్ది రోజుల్లో మళ్ళీ ఇస్లామాబాద్‌లోనే చర్చలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు.

చర్చలు విఫలం.. యుద్ధానికే దారి తీస్తాయా?

ఈ విఫల చర్చల వల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ విషయంలో ఇరాన్ పట్టు వదలకపోవడం, అమెరికా పట్టుబట్టడం చూస్తుంటే సీజ్‌ఫైర్ తర్వాత కూడా యుద్ధ మేఘాలు తొలగిపోలేదని స్పష్టమవుతోంది.

ఓ పక్క దౌత్యపరమైన చర్చలు జరుగుతుంటే.. మరోపక్క అగ్రనేతలు తమ ప్రాణాల కోసం రోడ్డు మార్గాలను ఆశ్రయించడం చూస్తుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్-అమెరికా మధ్య ఈ 'మైండ్ గేమ్' చివరికి శాంతికి దారితీస్తుందో లేక మహా సంగ్రామానికి నాంది పలుకుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+