Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..!

అమెరికా-ఇరాన్ సంఘర్షణ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ పాకుతోంది. ఈ యుద్ధానికి ముందు తెరిచి ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఆ తర్వాత దిగ్బంధించడంతో దాన్ని విడిపిస్తానని పంతం పట్టిన అమెరికా పలు విఫలయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈసారి తామే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ ప్రభావం భారత్ పై పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి (pm modi) ఇవాళ ట్రంప్ (donald trump) కాల్ చేశారు.

ఇరాన్ తో అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మోడీ-ట్రంప్ మధ్య తొలి ఫోన్ కాల్ ఇదే. ఇవాళ ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ తో విఫలమైన అమెరికా-ఇరాన్ చర్చలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని గతంలో దిగ్బంధించిన ఇరాన్ భారత్ కు మాత్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి వెసులుబాటు ఇవ్వాలని ప్రధాని మోడీ ట్రంప్ ను కోరినట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ ఏం హామీ ఇచ్చారో తెలియలేదు.

PM Modi Trump Hold 40-Minute Call on West Asia Crisis Stress Need to Keep Strait of Hormuz Open

ఈ ఫోన్ కాల్ సందర్భంగా ఇద్దరు నాయకులు మధ్యప్రాచ్య పరిస్థితి, వాణిజ్యంపై చర్చించారని భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలతో పాటు, వాషింగ్టన్‌లో అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న కొన్ని కీలక అంశాల గురించి కూడా తమ అధ్యక్షుడు ప్రధాని మోడీతో చర్చించారని గోర్ పేర్కొన్నారు. మరోవైపు భారత ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రధాని మోదీ ఆ ఫోన్ కాల్ సందర్భంగా ట్రంప్‌తో అన్నారు.

అనంతరం ప్రధాని మోడీ ఫోన్ కాల్ పై ట్వీట్ చేశారు. "నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించుకున్నాము. అన్ని రంగాలలో మన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము పశ్చిమ ఆసియాలోని పరిస్థితి గురించి కూడా చర్చించాము, హోర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాము' అని మోడీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+