అమెరికాతో చర్చల నుంచి ఇరాన్ ఔట్..! హార్ముజ్ పై ట్రంప్ యూటర్న్ ?

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ప్రారంభించిన యుద్దం ఊహించని మలుపులు తీసుకుంటూ ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనలకు చేరిన వేళ.. టెహ్రాన్ కూడా హార్ముజ్ జలసంధిని (strait of hormuz)నౌకల కోసం పూర్తిగా తెరిచింది. అయితే హార్ముజ్ దిగ్బంధం కొనసాగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన, ఇవాళ ఉదయం ఇరాన్ నౌకను టార్గెట్ చేయడంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో రేపు జరగాల్సిన చర్చలకు వెళ్లరాదని నిర్ణయించింది. దీంతో ఇరుకున పడ్డ ట్రంప్ (donald trump) యూటర్న్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఓవైపు హార్ముజ్ లో ఇరాన్ పోర్టుల నుంచి రాకపోకలు సాగించే నౌకలపై దిగ్బంధం కొనసాగిస్తూ మరోవైపు అదే ఇరాన్ తో పాకిస్తాన్ తో చర్చలకు సిద్ధమైన ట్రంప్ ఓవర్ స్మార్ట్ వైఖరి సమస్యను మళ్లీ మొదటికి వచ్చేలా చేసింది. హార్ముజ్ జలసంధిలో దిగ్బంధం కొనసాగిస్తున్న అమెరికాతో చర్చలకు రాలేమని మధ్యవర్తి అయిన పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కు ఇరాన్ తేల్చిచెప్పేసింది. దీంతో అదే విషయాన్ని ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెప్పారు. దీంతో ట్రంప్ హార్ముజ్ జలసంధిపై దిగ్బంధం సడలించడం ద్వారా చర్చలు కొనసాగేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Iran Pulls Out of US Talks Trump Hints at Lifting Hormuz Blockade to Keep Negotiations Alive

హార్ముజ్ దిగ్బంధనాన్ని ఎత్తివేసే ఏ ప్రకటన తర్వాత అయినా కాల్పుల విరమణ జరగవచ్చని, ఆ తర్వాత చర్చలను పునఃప్రారంభించే ప్రణాళికలను ఇరాన్ వివరించి, పాకిస్తాన్ కు బృందాలను పంపవచ్చని ఇస్లామాబాద్‌లోని వర్గాలు సీఎన్ఎన్ వార్తాసంస్ధకు తెలిపాయి. దౌత్యాన్ని కొనసాగించడంలో అమెరికా సీరియస్ గా లేదని అర్ధమవుతోందని, టెహ్రాన్ తన డిమాండ్ల నుండి వెనక్కి తగ్గదని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేటప్పుడు గడువులను లేదా అల్టిమేటమ్‌లను అంగీకరించదని ఇరాన్ ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇవాళ రాత్రికి హార్ముజ్ పై తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. అది సానుకూలంగా ఉంటే ఇరాన్ రేపు చర్చలపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+