మేము లొంగిపోం.. అడ్డొస్తే అణు బాంబులు వేస్తాం.. అమెరికాకు ఖమేనీ వార్నింగ్

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య 6 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఓ వైపు యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 17న ఇరాన్ కు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ వెంటనే లొంగిపోవాలని ఎలాంటి దాడులకు పాల్పడొద్దని ఆదేశించారు. ఈ క్రమంలో అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తక్షణమే లొంగిపోవాలంటూ జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అయితే తాము లొంగిపోయేది లేదంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తేల్చి చెప్పారు. అమెరికా జోక్యం చేసుకుంటే నష్టం తీవ్రత మరింత ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ యుద్ధంలో అమెరికా మిలిటరీ భాగస్వామ్యం అయితే ఊహించని నష్టం వాటిల్లుతుందని ఖమేనీ సీరియస్ మెసేజ్ ఇచ్చారు.

" ఇజ్రాయెల్ మాపై యుద్ధాన్ని మోపింది. ఇరాన్ దేశం ధీటుగా యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. మేము శాంతిని ఎంతలా ప్రేమిస్తామే.. యుద్ధాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంటాం. ఇరాన్ ఎవరికీ తలవంచం జరగదు" అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఓ టెలివిజన్ ద్వారా స్పష్టం చేశారు. తమపై దాడులు చేసి ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని ఖమేనీ అన్నారు. తమ సైనికుల రక్తాన్ని చూసిన వాళ్లను విడిచిపెట్టం అని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఎవరి ముందూ తలవంచరని అమెరికాకు తెలుసని అన్నారు. అమెరికా సైన్యం ఈ యుద్ధంలో తల దూరిస్తే ఎవరూ పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు.

Iran Rejects Trump s Call for Surrender Warns of Dire US Intervention Consequences

అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంపై తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో కీలక ప్రకటన చేశారు. "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు. అతడ్ని సులభంగా టార్గెట్ చేయొచ్చు. కానీ అతడ్ని చంపాలనుకోవడం లేదు. వీలైనంత త్వరగా లొంగిపోతే మంచిది. అయితే ప్రజలపై, అమెరికా సైన్యంపై దాడులు ప్రయోగించడాన్ని కోరుకోవడం లేదు. మాకు ఓపిక తగ్గిపోతోంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+